Begin typing your search above and press return to search.

ఎవ‌రు ఈ తెలుగు సూప‌ర్‌హీరో! ఏమిటి అత‌డి సాహ‌సం?

మ‌ధురాశ్రీ‌ధ‌ర్ స్నేహ‌గీతం చిత్రంతో క‌థానాయ‌కుడిగా కెరీర్ ని ప్రారంభించాడు అర‌వింద్ కృష్ణ‌. టాలీవుడ్‌లో హీరోగా అర‌డ‌జ‌ను పైగా చిత్రాల్లో న‌టించాడు.

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:40 AM GMT
ఎవ‌రు ఈ తెలుగు సూప‌ర్‌హీరో! ఏమిటి అత‌డి సాహ‌సం?
X

మ‌ధురాశ్రీ‌ధ‌ర్ స్నేహ‌గీతం చిత్రంతో క‌థానాయ‌కుడిగా కెరీర్ ని ప్రారంభించాడు అర‌వింద్ కృష్ణ‌. టాలీవుడ్‌లో హీరోగా అర‌డ‌జ‌ను పైగా చిత్రాల్లో న‌టించాడు. అరవింద్ కృష్ణ న‌టించిన త‌దుప‌రి చిత్రం A-మాస్టర్ పీస్ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. సూప‌ర్ హీరోగా మారే యువ‌కుడి క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింద‌ని తాజాగా రిలీజైన ప్రీటీజ‌ర్ వెల్ల‌డిస్తోంది.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ట్విస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హీరో చిత్రంగా ప్రచారం జరుగుతోంది. సుకు పూర్వాజ్ దర్శకర‌చ‌యిత‌. పవర్-ప్యాక్డ్ టీజర్ సూపర్ పవర్స్ ఉన్న యువకుడి విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. కథాంశం గురించి పెద్దగా వెల్లడించకుండా అంచనాలను పెంచుతోంది టీజ‌ర్‌. అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో సూపర్ హీరోగా నటించారు. స‌మాజంలో న్యాయం కోసం పోరాడే సూప‌ర్ హీరోగా అత‌డు క‌నిపిస్తాడా? అన్న‌ది వేచి చూడాలి. విల‌న్ గా మనీష్ గిలాడా ఆశ్చర్యపరిచాడు. హీరో విల‌న్ న‌డుమ వార్ ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎ- మాస్ట‌ర్ పీస్ టైటిల్ కి త‌గ్గ‌ట్టే విజువ‌ల్ రిచ్ సినిమా అని టీజ‌ర్ వెల్ల‌డించింది. నేప‌థ్య సంగీతం మ‌రో అస్సెట్. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణంలో అషు రెడ్డి, స్నేహా గుప్తా కథానాయికలుగా క‌నిపిస్తున్నారు. కొంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న అర‌వింద్ కృష్ణ‌కు విజ‌యం ద‌క్కుతుందనే ఆకాంక్షిద్దాం.