Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ వీడియో వైరల్.. ముసలోడంటూ ట్రోల్స్

ఈ స్టార్‌ హీరో ఇటీవల ఓ ఎయిర్ పోర్ట్ లో అజిత్ కనిపించాడు. ఆ సందర్భంగా లుక్ షాకింగ్‌ గా ఉంది.

By:  Tupaki Desk   |   26 July 2023 10:04 AM GMT
సూపర్ స్టార్ వీడియో వైరల్.. ముసలోడంటూ ట్రోల్స్
X

తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అజిత్ ప్రతి సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాల్లో పెద్దగా మేకప్‌ లేకుండా సింపుల్ గా ఓల్డ్ లుక్‌ లో కనిపించినా కూడా ఫ్యాన్స్ వెరెక్కి పోయి అజిత్‌ ను అభిమానిస్తూ ఉంటారు. అయితే తాజాగా లుక్ తో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

ఈ స్టార్‌ హీరో ఇటీవల ఓ ఎయిర్ పోర్ట్ లో అజిత్ కనిపించాడు. ఆ సందర్భంగా లుక్ షాకింగ్‌ గా ఉంది. పొట్ట బాగా పెరగడంతో పాటు ఫిజిక్ కూడా గతంతో పోల్చితే బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. అంతే కాకుండా గతంలో తెల్ల జుట్టు.. గడ్డం స్టైల్ గా అనిపించినా కూడా ఇప్పుడు మాత్రం వృద్ధుడు అన్నట్లుగా ఫీల్ కలిగిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లో ఇలా చూసినా పర్లేదు అనిపిస్తుంది కానీ నిజ జీవితంలో ఇలా చూడటం షాకింగ్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు కూడా అజిత్ మరీ ఇలా తయారు అయ్యాడు ఏంట్రా బాబు అని మాట్లాడుకుంటున్నారు.

గతంలో అజిత్ గురించి ఎవరు ట్రోల్‌ చేసినా కూడా వెంటనే సీరియస్ గా స్పందించే వారు.. కానీ ఇప్పుడు ఈ వీడియోకు వస్తున్న ట్రోల్స్ ను ఫ్యాన్స్ కూడా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఒక వైపు ఆరు పదుల వయసు దాటిన రజినీకాంత్‌.. కమల్‌ హాసన్ లు డైటింగ్ లు చేస్తూ స్లిమ్‌ గా నాజూకుగా కనిపిస్తూ ఉంటే అజిత్ మాత్రం ఎందుకు ఇంతగా లావుగా కనిపిస్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న. కొందరు మాత్రం అజిత్ ఏదైనా సినిమా కోసం ఇలా తన ఫిజిక్ ను మార్చుకున్నాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.