Begin typing your search above and press return to search.

లెగ్ వర్కౌట్ తో రష్మిక కష్టాలు.. చెమటలు పట్టేలా

టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో రష్మిక ఒకరు. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ, వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 9:40 AM GMT
లెగ్ వర్కౌట్ తో రష్మిక కష్టాలు.. చెమటలు పట్టేలా
X

టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో రష్మిక ఒకరు. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ, వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతోంది. మొన్నటి వరకు దక్షిణాదిన వరస సినిమాలు చేస్తూ ఆకట్టుకున్న ఆమె, బాలీవుడ్ లోనూ వరస ఆఫర్లు అందుకుంటోంది. కాగా, ఆ సినిమాల కోసం రష్మిక చాలా కష్టపడుతోంది.

మామూలుగానే హీరోయిన్లు ఫిట్నెస్ విషయంలో ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అయితే, రష్మిక మాత్రం మరింత ఎక్కువ కష్టపడుతుంది. తాజాగా, సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియో చూసి ఫ్యాన్స్ సైతం షాకైపోతున్నారు. ఆమె వీడియోలో జిమ్ లో కష్టపడుతుంది. ముఖ్యంగా లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా మారుతోంది. అవి చేస్తున్నప్పుడు ఎంత నొప్పిగా ఉన్నా, దానిని భర్తిస్తూ ఆమె చేయడం విశేషం.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక చెమటలు చిందించేందుకు పడుతున్న కష్టం చూసి ఫ్యాన్స్ షాకైపోతున్నారు. ఆమె డెడికేషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, రీసెంట్ గా రష్మిక సినిమాలతో సంబంధం లేకుండా హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవర కొండతో కలిసి ఆమె లివ్ ఇన్ రిలేషన్ లో ఉందని ప్రచారం జరిగింది.

ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోని బట్టి, ఈ విషయాన్ని నెటిజన్లు బయటపెట్టారు. విజయ్ కూడా అదే ప్లేస్ లో గతంలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా, ఈ రెండింటినీ కలిపి వీరిద్దరూ ఓకే ఇంట్లో ఉంటున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మాత్రం ఇప్పటి వరకు విజయ్ కానీ, రష్మిక కానీ స్పందించలేదు.

ఇదిలా ఉండగా, రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప2లో నటిస్తోంది. దీంతో పాటు, నితిన్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ మూవీ నుంచి రష్మిక తప్పుకుంది. అయినా, రష్మిక చేతిలో బాలీవుడ్ లో సినిమాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ మూవీలో తన పాత్ర కోసం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.