స్టార్ హీరో సినిమా ఓటీటీ వెయిటింగ్‌కి ఫుల్‌స్టాప్
తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మే 31న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
By: Tupaki Desk | 26 May 2025 7:20 AMఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల థియేట్రికల్ రిలీజ్ కోసం అభిమానులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారో.. అదే స్థాయిలో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి స్టార్ హీరో సినిమాను ఒక వర్గం ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. థియేటర్‌కి వెళ్లి చూడలేక పోయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని ఆశ పడుతున్నారు. అందుకే థియేటర్ స్క్రీనింగ్‌కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో.. అంతకు మించి ఓటీటీ స్ట్రీమింగ్‌కి క్రేజ్ ఉంటుంది. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం సూర్య సినిమా 'రెట్రో' కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ 'రెట్రో' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకోవడంలో విఫలం అయింది. అయినా కూడా సూర్య ఫ్యాన్స్ థియేట్రికల్ స్క్రీనింగ్ మిస్ అయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. మే 1న విడుదలైన రెట్రో సినిమాను మొదట మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ సినిమాను మూడు వారాల్లో స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతల నుంచి వ్యతిరేకత రావడంతో నెట్‌ఫ్లిక్స్ రెట్రో సినిమాను వారం ఆలస్యంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మే 31న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కేవలం తమిళ్‌లో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ రెట్రో సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని దృవీకరించింది. సూర్య అభిమానులు రెట్రో సినిమా స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్య గత చిత్రం కంగువా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై పెట్టుకున్న నమ్మకంను వమ్ము చేశాడు. కమర్షియల్‌గా రెట్రో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
రెట్రో సినిమాలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. సినిమాలో జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. గ్యాంగ్‌స్టర్ పారి ప్రేమలో పడటంతో సాధారణ జీవితం సాగించాలని భావిస్తాడు. కానీ అతడు అంతకు ముందు చేసిన పనుల కారణంగా సాదారణ జీవితం సాగించడం కష్టం అవుతుంది. ప్రేమలో పడ్డ పారి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న సమయంలో ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి అనేది సినిమా కథగా చూపించారు. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన రెట్రో సినిమా ఓటీటీ ద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు ప్లాప్ అయ్యినా, కొన్ని ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే రెట్రో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.