Begin typing your search above and press return to search.

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సూర్య కరుప్పు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్లలో సందడి చేసిన ప్రతి సినిమా దాదాపుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   12 Jun 2026 10:19 AM IST
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సూర్య కరుప్పు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

థియేటర్లలో సందడి చేసిన ప్రతి సినిమా దాదాపుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే థియేటర్లలో విడుదలైన ఆ సినిమా ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుంది అనే విషయం ఆ సినిమా ఫలితం పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సినిమా మంచి విజయం అందుకుంది అంటే 8 వారాలు లేదా 10 వారాలు ఆ సినిమా ఓటీటీలోకి రావడానికి సమయం పట్టవచ్చు. ఒకవేళ ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్రేక్షకులను మొదటి షోతోనే మెప్పించలేకపోతే వారంలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఓటిటిలోకి వచ్చేసిన కరుప్పు..

ఎలా ఉన్నా సరే ఆ సినిమా ఓటీటీలోకి రావడం మాత్రం పక్కా. అందుకే థియేటర్లలో సినిమాను మిస్సయిన చాలామంది ఆడియన్స్ ఇటు ఓటిటిలో తమకు నచ్చిన సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం కరుప్పు. తెలుగులో వీరభద్రుడు పేరిట రిలీజ్ చేశారు. థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని రూ.305 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఆ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి..

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12న అనగా నేటి నుండి ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో త్రిష - సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫాంటసీ, యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది . మరి ఈ సినిమా ఈ ఓటీటీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కరుప్పు సినిమా కథాంశం..

కరుప్పు సినిమా కథాంశం విషయానికి వస్తే.. అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురికి వైద్యం చేయించడం కోసం ఒక అమాయక తండ్రి హైదరాబాద్ కి వెళ్తాడు. అక్కడ దురదృష్టవశాత్తు నాంపల్లి రైల్వే స్టేషన్లో దిగగానే దొంగలు వారిపై దాడి చేసి వారి దగ్గర ఉన్న 60 సవర్ల బంగారాన్ని దోచుకెళ్తారు. ఇక తర్వాత పోలీసులను ఆశ్రయిస్తే కేవలం 45 సవర్ల బంగారం మాత్రమే రికవరీ చేసి దానిని కూడా కోర్టు ఆర్డర్ ద్వారానే తీసుకోవాలని షరతు పెడతారు. దీంతో ఆ తండ్రి కూతుర్లు బేబీ కృష్ణ అనే లాయర్ ను ఆశ్రయిస్తారు. డబ్బు పిచ్చి ఉన్న ఆ కమర్షియల్ లాయర్.. జడ్జితో చేతులు కలిపి కేసును వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటాడు.

వీరభద్రుడు ఆ తండ్రీకూతుళ్లకు న్యాయం చేశాడా?

చివరికి బాధితులు ఎదురు తిరగడంతో పోలీసులు రికవరీ చేసిన బంగారం కూడా దక్కకుండా చేస్తామని బెదిరిస్తారు. చేసేదేమీ లేక ఆ తండ్రి కోర్టు ఆవరణలోనే ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లి క్షేత్రపాలకుడైన ఆ స్వామికి తన కష్టాన్ని చెప్పుకుంటాడు. ఇక తర్వాత భూమ్మీదకి వీరభద్రుడు వచ్చి ఆ తండ్రీ కూతుళ్లకు ఎలా న్యాయం చేకూర్చాడు? అనే యాక్షన్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తానికి అయితే థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటు ఓటీటీలో రికార్డు మోత సృష్టించడం ఖాయమని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.