Begin typing your search above and press return to search.

మా తప్పు వల్లే ఇంగ్లండ్ కు ప్రపంచ కప్.. అంపైర్ సంచలన కామెంట్స్!

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తీవ్ర ఉత్కంఠ నడుమ విజయం ఇంగ్లిష్ జట్టును వరించింది.

By:  Tupaki Desk   |   3 April 2024 4:02 AM GMT
మా తప్పు వల్లే ఇంగ్లండ్  కు ప్రపంచ కప్.. అంపైర్  సంచలన కామెంట్స్!
X

అంతర్జాతీయ క్రికెట్ లో రివ్యూలు లేని సమయంలో అంపైర్ల నిర్ణయాలు అత్యంత కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే! కొన్ని సార్లు వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఊహించని పరిణామలే ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో తాము తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ కు ఏకంగా ప్రపంచ కప్పే వచ్చిందంటూ అంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి!

అవును... క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ 2019లో మొట్టమొదటి సారి ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తీవ్ర ఉత్కంఠ నడుమ విజయం ఇంగ్లిష్ జట్టును వరించింది. అయితే... అందుకు తాము తీసుకున్న ఒక తప్పు నిర్ణయం కూడా కారణం అంటూ ప్రముఖ అంపైర్ మారిస్ ఎరాస్మస్ తాజాగా స్పందించారు.

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అంపైరింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఎరాస్మస్... 2019 నాటి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ విషయాలను పంచుకున్నారు. ఆ మ్యాచ్ లో ఎరాస్మస్ తో పాటు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఈ సమయంలో చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 15 పరుగులు అవసరం పడింది.

ఈ సమయంలో... చివరి మూడు బంతుల్లోనూ 9 పరుగులు అవసరం పడింది. ఈ సమయంలో... నాలుగో బంతికి బెన్‌ స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ లు రెండో పరుగుకు ప్రయత్నించగా... మార్టిన్ గుప్టిల్ విసిరిన బంతి బెన్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి బౌండరీకి చేరింది. దీంతో... ఆ రెండు పరుగులతో పాటు బౌండరీని కలిపి అంపైర్ ఆరు పరుగులు ఇచ్చారు. దీంతో.. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.

వాస్తవానికి గుప్టిల్ త్రో చేసిన ఆ బంతి బెన్ స్టోక్ బ్యాట్ కి తగిలే సమయానికి రెండో పరుగు పూర్తి కాలేదు. దీంతో... ఐసీసీ రూల్స్ ప్రకారం ఐదు పరుగులు మాత్రమే ఇవ్వాలి. అయితే... నాడు అంపైర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా చివరి రెండు బంతుల్లోనూ మూడే పరుగులు అవసరం పడింది. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.. ప్రపంచ కప్ ని తొలిసారి ముద్దాడింది!

ఈ క్రమంలో తాజాగా నాటి విషయాలను గుర్తు చేసుకున్న అంపైర్ ఎరాస్మస్... ఆ తప్పిదం జరగకపోయి ఉంటే మ్యాచ్ మరో మలుపు తిరిగి ఉండేదేమో అని స్పందించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి!

కాగా... టీవీ అంపర్ గా 131 తో కలిపి మొత్తం 380 మ్యాచ్ లకు అంపైర్ గా పనిచేసిన ఎరాస్మస్... 2016, 2017, 2021 సంవత్సరాల్లో ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్‌ గా డేవిడ్ షెపర్డ్ ట్రోఫీని గెలుచుకున్నారు!