Begin typing your search above and press return to search.

హార్దిక్ ఇక చాలంటున్న ఫ్యాన్స్... రోహిత్ రియాక్షన్ వైరల్!

దీంతో... రోహిత్ ఫ్యాన్స్, పలువురు ముంబై ఫ్యాన్స్ మరోసారి హార్దిక్ ను టార్గెట్ చేశారు!

By:  Tupaki Desk   |   2 April 2024 4:27 AM GMT
హార్దిక్  ఇక చాలంటున్న ఫ్యాన్స్... రోహిత్  రియాక్షన్  వైరల్!
X

హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వరుస ఓటములను చవి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ మరో ఘోర పరాభవాన్ని చవి చూసింది. రాజస్థాన్ రాయల్స్ ఆలౌరౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో.. 6 వికెట్ల తేడాతో సొంతగడ్డపైనే ముంబై చిత్తయ్యింది. దీంతో... రోహిత్ ఫ్యాన్స్, పలువురు ముంబై ఫ్యాన్స్ మరోసారి హార్దిక్ ను టార్గెట్ చేశారు!

అవును... తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై మట్టికరిచిన సంగతి తెలిసిందే. క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టిన పరిస్థితి. ఇందులో రోహిత్ శర్మ (0), నమన్ ధీర్ (0), బ్రేవిస్ (0), పియూష్ చావ్లా (3), ఇది ముంబై బ్యాటర్స్ పెర్ఫార్మెన్స్! తిలక్ వర్మ (32), హార్దిక్ పాండ్యా (34) మాత్రమే ఉన్నంతలో కాస్త పరువు నిలబెట్టారు! అయినప్పటికీ హార్దిక్ ని టార్గెట్ చేస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్!

ఇందులో భాగంగా... కెప్టెన్ గా వ్యూహాలు అమలుచేయడంలో హార్దిక్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. "ఇక చాలు హార్దిక్.. రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించెయ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాకానిపక్షంలో ఈ సీజన్ లో ఒక్కమ్యాచ్ కూడా గెలవలేమని చెబుతున్నారు!

రోహిత్ రియాక్షన్ వైరల్!:

ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ టీం పెర్ఫార్మెన్సే బాగాలేదని.. పాండ్యాపై అసంతృప్తితో కొంతమంది ఆటగాళ్లు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నట్లున్నారని కామెంట్లు వినిపిస్తున్న వేళ... రోహిత్ ఫ్యాన్స్ మాత్రం హార్దిక్ ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో హార్దిక్ ని ఎగతాలి చేస్తున్న ఫ్యాన్స్ ని వారిస్తూ.. పాండ్యాకు మద్దతుగా నిలిచాడు హిట్ మ్యాన్ రోహిత్!

సోమవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ ని ఎగతాలి చేస్తూ అరవడం మొదలుపెట్టారు అభిమానులు! దీంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. వారిని ఆపమంటూ సైగ చేశారు. దీంతో... దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సమయంలో హార్దిక్ కి అండగా పలువురు సీనియర్ ఆటగాళ్లు, పక్క ప్రాంఛైజీ ప్లేయర్లూ మద్దతుగా నిలుస్తూ... పాండ్యా టీం ఇండియా ఆటగాడనే విషయం మరిచిపోవద్దని హితవు పలుకుతున్నారు!