15 సూపర్ ఓవర్లు.. 4 ఢిల్లీవే.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ..
ఇక ఇప్పటివరకు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది. ఆ జట్టు నాలుగుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. మూడుసార్లు నెగ్గింది.
By: Tupaki Desk | 17 April 2025 7:51 AMఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ’సూపర్’లో సూపర్.. టి20 క్రికెట్ అంటే ధనాధన్ బ్యాటింగ్ మాత్రమే కాదు.. అద్భుతమైన ముగింపులూ ఉంటాయని చాటిచెప్పేదే సూపర్ ఓవర్. మ్యాచ్ లో స్కోర్లు టై (సమం) అయినప్పుడు నిర్వహించే ఈ ఓవర్ కు భలే క్రేజ్ ఉంటుంది.
2008లో మొదలైన ఐపీఎల్ లో 18వ సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు 15 సూపర్ ఓవర్లు జరిగాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్) మాత్రమే ఐదుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. నాలుగుసార్లు గెలిచింది. మరే జట్టూ ఇన్నిసార్లు సూపర్ ఓవర్ లో నెగ్గలేదు.
ఇక ఇప్పటివరకు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది. ఆ జట్టు నాలుగుసార్లు సూపర్ ఓవర్ ఆడింది. మూడుసార్లు నెగ్గింది. దీనిని ఇప్పుడు ఢిల్లీ అధిగమించింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. రాజస్థాన్ కూడా 20 ఓవర్లలో అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది.
ఇక సూపర్ ఓవర్లో ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా బంతులేసి 11 పరుగులే ఇచ్చాడు. ఈ స్కోర్ ను నాలుగు బంతుల్లోనే కొట్టేసింది ఢిల్లీ.
అప్పడు సన్ రైజర్స్
ఐపీఎల్ లో చివరిసారి 2021లో సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు ప్రత్యర్థి సన్ రైజర్స్. గెలిచింది ఢిల్లీనే. ఇక గత మూడు సీజన్లలో సూపర్ ఓవర్ కనిపించలేదు.