Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా కెప్టెన్ కుర్చీ... శ్రేయస్‌దా? శాంసన్‌దా? లేక సెలక్టర్లదే కన్ఫ్యూజనా!

ఒక వర్గం "శ్రేయస్ అయ్యర్ ఫిక్స్" అంటుంటే.. మరో వర్గం "శాంసన్‌కే ఛాన్స్" అని సోషల్ మీడియాలో గట్టిగా బ్యాటింగ్ చేస్తోంది.

By:  A.N.Kumar   |   4 Jun 2026 6:00 PM IST
టీమ్ ఇండియా కెప్టెన్ కుర్చీ... శ్రేయస్‌దా? శాంసన్‌దా? లేక సెలక్టర్లదే కన్ఫ్యూజనా!
X

భారత టీ20 క్రికెట్ జట్టుకు కొత్త బాస్ ఎవరు? ప్రస్తుతం సోషల్ మీడియా నుండి టీవీ ఛానెళ్ల వరకు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. భారత జట్టు కొత్త టీ20 కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానం చెప్పేలోపే, క్రికెట్ అభిమానులు మూడు వర్గాలుగా విడిపోయారు.

ఒక వర్గం "శ్రేయస్ అయ్యర్ ఫిక్స్" అంటుంటే.. మరో వర్గం "శాంసన్‌కే ఛాన్స్" అని సోషల్ మీడియాలో గట్టిగా బ్యాటింగ్ చేస్తోంది. ఇక మూడో వర్గం మాత్రం "రేపు ఇంకో పేరు వస్తుంది చూద్దాం" అంటూ చేతిలో పాప్‌కార్న్‌ పట్టుకుని మరీ ఈ డ్రామాను ఎంజాయ్ చేస్తోంది.

గంభీర్ ఎంట్రీతో మారిన సమీకరణాలు!

తాజా కథనాల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ పేరు దాదాపు ఖరారైందనే వార్తలు వచ్చాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన ట్రాక్ రికార్డ్ శ్రేయస్ సొంతం. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది! కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం "ఆగండి బాస్!" అంటూ సంజూ శాంసన్ పేరును తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

గంభీర్ కు సంజూ శాంసన్ ఆటతీరు, అతని లీడర్‌షిప్ క్వాలిటీస్ పై గట్టి నమ్మకం ఉందట. దీంతో సెలక్షన్ కమిటీ అధికారిక సమావేశం కంటే, సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లోనే ఎక్కువ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ప్రధాన పోటీదారులుగా రేసులో దూసుకుపోతున్నారు.

రేసులో 'ఇతరులు'.. అభిమానుల జోకులు!

ఈ ఇద్దరితో పాటు యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాయని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అయితే వాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే.. ఎన్నికల ఫలితాల్లో "ఇతరులు" కాలమ్‌లో నిలిచిన అభ్యర్థుల్లా మారిందని క్రికెట్ అభిమానులు జోకులు పేలుస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ సీనియార్టీ , ప్రస్తుత ఫామ్ రీత్యా వీరికి అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

రోజుకో పేరు.. ఇదో క్రికెట్ డైలీ సీరియల్!

గత కొన్ని వారాలుగా వస్తున్న మీడియా కథనాలను గమనిస్తే.. బిసిసిఐ సెలక్టర్ల కంటే ముందే మీడియా వాళ్లే కెప్టెన్‌ను మార్చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మరుసటి రోజు సీన్ కట్ చేస్తే.. శాంసన్‌కే పగ్గాలు అని కథనాలు మారుతాయి. ఇంకో రోజు అసలు ఈ ఇద్దరూ కాదట, సరికొత్త పేరు పరిశీలనలో ఉందంటూ ట్విస్ట్ ఇస్తారు. దీంతో బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ప్రతి వార్తను "టాస్‌కు ముందు వచ్చిన పిచ్ రిపోర్ట్" గానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిచ్ రిపోర్ట్ చూసి మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేయలేనట్లే, ఈ లీకులను చూసి కెప్టెన్ ఎవరో చెప్పలేకపోతున్నారు.

కుర్చీ ఒక్కటే.. అభ్యర్థులు ఎందరో!

అంతిమంగా చూస్తే.. టీమ్ ఇండియాకు కెప్టెన్ ఎవరో కావడం కంటే "ఈరోజు కెప్టెన్ రేసులో ఎవరు ముందున్నారు?" అన్నదే భారత క్రికెట్‌లో ఒక కొత్త డైలీ సీరియల్‌గా మారిపోయింది. రోజుకో మలుపుతో సాగుతున్న ఈ హై-డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.

అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానుల పరిస్థితి మాత్రం ఒక్కటే... "కెప్టెన్ కుర్చీ ఖాళీగా ఉంది... కానీ అభ్యర్థులు ఫుల్‌గా ఉన్నారు!" మరి ఈ హై-వోల్టేజ్ రేసులో తుది విజేతగా నిలిచి టీమ్ ఇండియాను నడిపించే ఆ లక్కీ కెప్టెన్ ఎవరో తెలియాలంటే బీసీసీఐ అధికారిక ముద్ర వేసే వరకు ఆగాల్సిందే!