Begin typing your search above and press return to search.

రూ.6.6 కోట్ల ఇల్లు.. రూ.100కే.. అర్హతలు ఇవే

బ్రిటన్ లోని లూయి నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్ లో నివాసం ఉండే వారికి ఇళ్లను ఇచ్చేందుకు భారీ ఆఫర్ ను ప్రకటించారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:30 PM GMT
రూ.6.6 కోట్ల ఇల్లు.. రూ.100కే.. అర్హతలు ఇవే
X

మీరు చదివినదాన్లో ఎలాంటి తప్పు లేదు. హైప్ క్రియేట్ చేస్తున్నది లేదు. మరింత క్లియర్ గా.. క్లారిటీగా చెప్పాలంటే ఒక పౌండ్ (బ్రిటన్ కరెన్సీ) మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.103లకే 6.4లక్షల పౌండ్లు విలువ చేసే (మన రూపాయిల్లో రూ.6.6కోట్లు) విలువ చేసే గ్రేడ్ 2 లిస్టెడ్ ప్లాట్ ను ఇచ్చేందుకు బ్రిటన్ లోని ఒక నగరం రెఢీ అయ్యింది. దీనికి సంబంధించిన అంగీకారాన్ని కౌన్సిల్ ఓకే చేసింది. ఇంతకూ ఆ నగరం ఎక్కడ ఉంది? అంత కారుచౌకకు ఇంటిని ఎందుకు ఇస్తున్నారు? దానికి ఉండాల్సిన అర్హత ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..

బ్రిటన్ లోని లూయి నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్ లో నివాసం ఉండే వారికి ఇళ్లను ఇచ్చేందుకు భారీ ఆఫర్ ను ప్రకటించారు. అయితే.. ఈ ఫ్లాట్ లను బహిరంగ మార్కెట్ లో అమ్మట్లేదు. ఒకవేళ అలా చేస్తే లూయి పట్టణంలోని వారికి తక్కువ ధరలో నివాసం ఉండే అవకాశాన్ని కోల్పోతారని.. అందుకే రీడెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పేదలకు మాత్రమే ఈ ప్లాట్లను అందుబాటులో ఉండేలా చేయాలని నిర్ణయించారు.

అధిక సంఖ్యలో హాలిడే హోంలు ఉండే ఇంగ్లండ్ లో సెకండ్ హోమ్ లు.. హాలిడే హోంల సమస్య కార్న్ వాల్ లో ఎక్కువగా ఉంటుంది. 2021లో ఈ ప్రాంతంలో 13వేలకు పైగా సెకండ్ హోంలు ఉన్నాయని తేల్చారు. పెద్దగా వినియోగం లేని వీటిని పునరుద్దరించేందుకు ఒక మిలియన్ పౌండ్ల మొత్తాన్ని త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఈ ఇళ్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. వాటిల్లో ముఖ్యమైనది ఈ ప్రాపర్టీలో కనీసం ఐదేళ్లు ఉండేందుకు అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తుండాలి. కుటుంబ ఆదాయం 18వేల నుంచి 25వేల పౌండ్ల మధ్య ఉండాలి. అందుకు అంగీకారాన్ని తెలిపిన వారికే ఈ ఇళ్లను ఇవ్వనున్నారు. ఏమైనా అదిరే ఆఫర్ కదూ?