Begin typing your search above and press return to search.

కన్నడసీమలో ‘వైఎస్ ఆర్ కుటుంబం’!

By:  Tupaki Desk   |   19 Sept 2017 6:00 PM IST
కన్నడసీమలో ‘వైఎస్ ఆర్ కుటుంబం’!
X
వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. వైఎస్ జగన్ మీద జనంలో ఉన్న ఆదరణకు ప్రతీకగా నిలుస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి.. జగన్ తో నేరుగా ఫోనులో సంభాషించడానికి ఉత్సాహం చూపిస్తున్న అభిమాన జనశ్రేణి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఇన్ ఛార్జులు నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆదరణ దక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమానికి మద్దతు, అద్భుత ప్రజాస్పందన లభిస్తోంది. తాజాగా బెంగుళూరులో కూడా ఈ కార్యక్రమాన్ని భారీస్థాయిలో ఏర్పాటుచేస్తున్నారు.

అనంతపురం జిల్లా కదిరి - పుట్టపర్తి నియోజకర్గాలకు చెందిన వందల మంది పొరుగున ఉన్న బెంగుళూరులోనూ నివసిస్తుంటారు. ఇలాంటి వారికోసం వైసీపీ ఈ ఆదివారం నాడు బెంగుళూరులో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కదిరి నియోజకవర్గ ఇన్ ఛార్జి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం ఇన్‌ఛార్జి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి లు కలసి బెంగుళూరులో ‘వైఎస్సార్ కుటుంబం మరియు నవరత్నాల సభ’ ను నిర్వహిస్తున్నారు.

ఆదివారం 24వ తేదీన, ఎలక్ట్రానిక్ సిటీ, దొడ్డతోగూరులోని, లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సమీపంలోని ప్రగతి రాయల్ -2 వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం పదిన్నర నుంచి మొదలయ్యే కార్యక్రమంలో మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. బెంగుళూరు, పరిసర ఇతర ప్రాంతాల్లో నివసించే.. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా.. జగన్ మీద తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కోరుతున్నారు.