Begin typing your search above and press return to search.
కీలక నిర్ణయాన్ని తీసుకున్న జగన్ సర్కారు.. పరీక్ష రాయకున్నా పాస్
By: Tupaki Desk | 26 Aug 2020 1:15 PM ISTకరోనా మహమ్మారి దేశంలోకి అడుగు పెట్టిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఈ సందర్భంగా ఒకసారి ఆయన మాట్లాడుతూ..కొన్నిసార్లు పరిస్థితులు చాలా చిత్రంగా ఉంటాయని.. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం సమయంలో.. పరీక్షలు నిర్వహించకుండానే అందరిని పాస్ చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొని ఉండటం విశేషం.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల్ని రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా పరీక్ష రాయకున్నా పాస్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లిస్తే చాలు.. వారందరిని పైతరగతులకు ప్రమోట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఫీజు కట్టి ఎగ్జామ్ రాయని వారిని కూడా పాస్ చేయాలని నిర్ణయించటం గమనార్హం.
జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీలో దాదాపు 44 వేల మంది విద్యార్థులకు లబ్థి చేకూరుతుందని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు జరగకుండా వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల విషయంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే సమయంలో వాయిదా పడిన విద్యా సంవత్సరాన్ని సైతం స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.
ఇందులో భాగంగా ఏపీ పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. స్కూళ్లను రీ ఓపెన్ చేసిన రోజున ఈ క్యాలండర్ ను వెల్లడిస్తారని చెబుతున్నారు. మొత్తానికి కరోనా ఏమో కానీ.. చిత్రవిచిత్రమైన ఉదంతాలకు నెలవుగా మారిందని చెప్పక తప్పదు.