Begin typing your search above and press return to search.

మ‌హానాడు వైసీపీ అడ్డంకులు.. టీడీపీ నేత‌లు ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   30 May 2022 2:32 AM GMT
మ‌హానాడు వైసీపీ అడ్డంకులు.. టీడీపీ నేత‌లు ఏమ‌న్నారంటే
X
వైసీపీ నాయకులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. మహానాడును ప్రజలు విజయవంతం చేశారని టీడీపీ నేతలు తెలిపారు. మహానాడు నిర్వహణకు స్థలమిచ్చిన మండువవారిపాలెం రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన మహనాడు చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని పేర్కొన్నారు. చంద్రబాబును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని.. నిన్నటి సభతో ఆ విషయం రూఢీ అయిందని అన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులను అభినందించారు. మహానాడు నిర్వహణకు స్థలమిచ్చిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.

ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం కావటంతో.. వైసీపీ నాయకులకు మింగుడు పడటంలేదని టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. బస్సులు ఆపించినా, టైర్లలో గాలి తీయించినా సభ విజయవంతం కావడం.. మహానాడు వేదికగా టీడీపీ నాయకులు ప్రశ్నించడంతో.. ఫ్రస్టేషన్లో మంత్రులు, జిల్లా నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.

మంత్రి రోజా అత్యాచార ఘటనలపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని వంగలపూడి అనిత అన్నారు. రోజా మంత్రిగా కాకుండా నటిగానే మాట్లాడుతున్నారు. ఆమె ఇంకా సంపూర్ణ రాజకీయ నాయకురాలిగా మారలేదన్నారు. రోజా తీరుచూ స్తుంటే.. మంత్రిగా అర్హురాలేనా? అని సందేహం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై నగరిలోనైనా, పర్యాట కశాఖ కార్యాలయంలోనైనా.. విజయవాడలోనైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమా? అని అనిత సవాల్ విసిరారు. మంత్రి రోజా తీరుకు నిరసనగా ఆమెను అడ్డుకుంటామన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. మహానాడు కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన మహనాడు చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీ.. నందమూరి తారక రామారావు విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి ఆయన మొహాన్ని కనబడకుండా చేశారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లు కట్టి ఎంపీ టికెట్లు అమ్ముకునే జగన్.. సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? అని విమర్శించారు. వైసీపీ ఆంబోతులు బస్సులెక్కి రంకెలేస్తున్నాయని ధ్వజమెత్తారు.