Begin typing your search above and press return to search.

జగన్ టెమ్ట్ అవుతారా... బాబు కోరిక తీరుస్తారా...?

By:  Tupaki Desk   |   15 Sep 2022 12:30 PM GMT
జగన్ టెమ్ట్ అవుతారా... బాబు కోరిక తీరుస్తారా...?
X
ఏపీలో రాజకీయాలు మామూలుగా లేవు. అంతా ట్రెడిషనల్ పాలిటిక్స్ ని దాటేసి కొత్త స్ట్రాటజీ ప్రకారమే సాగుతున్నాయి. పూర్తిగా మైండ్ గేమ్ మీదనే అధారపడి రాజకీయాలు అటూ ఇటూ కూడా చేస్తున్నారు. నిజానికి ఏపీలో ఇపుడు వైసీపీని టీడీపీ బాగా కార్నర్ చేసింది. అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎక్కడైతే పరిపాలనా రాజధానిని చేయాలనుకుని వైసీపీ పెద్దలు చతికిలపడ్డారో ఆ పాంతాలను చుట్టుముడుతూ అమరావతి రైతులు చేసే పాదయాత్ర నిజంగా రాజకీయంగా టీడీపీ వెనకుండి నడిపిస్తున్న అతి పెద్ద ఎత్తుగడగానే అంతా చూస్తున్నారు.

ఇక వైసీపీ తీరు చూస్తే ఏపీలో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పధకాలు అమలు చేశాం కదా దాంతో ఎన్నికల గోదారిని ఈదేయవచ్చు అని భావించింది. ఆ దిశగానే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. వైసీపీ సంక్షేమ అజెండాతో ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా అది టీడీపీకి ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో అజెండాను తెలివిగా చంద్రబాబు సెట్ చేశారు. అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల్గా అజెండా మారుతోంది. అమరావతి రాజధాని రియాలిటీ. మూడు రాజధానులు అన్నవి ఊహాజనితం.

ఈ రోజుకు కూడా అవి వైసీపీ పెద్దల మెదళ్లలో మాత్రమే ఉన్నాయి. రేపటి రోజున బిల్లు పెట్టి చట్టం చేస్దినా ఎంతవరకూ న్యాయ సమీక్షకు నెగ్గుతుందో ఎవరికీ తెలియదు. ఆ మీదట ఒకవేళ మూడు రాజధానులు అంటూ ముందుకెళ్ళినా ఎన్నికలు చూస్తే ఏణ్ణర్ధం మాత్రమే ఉన్నాయి. ఈ వ్యవధి ఏ కోశానా సరిపోదు. దాంతో ఇపుడు వైసీపీ బాగా ఇరుకున పడింది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ ట్రాప్ లో పడింది.

అసెంబ్లీలో మూడు రాజధానుల మీద చట్టం చేసినా కేంద్రం కూడా ఇపుడు మూడ్ మార్చుకున్న వేళ ఏపీలో వైసీపీ దీని మీద ఎటూ ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలోని అయిదు కోట్ల జనాలు అమరావతి వర్సెస్ మూడు రాజధానుల వివాదాన్ని చూసి బాగా విసిగిపోతున్నారు. ఏపీకి అసలు ఏదో ఒక రాజధాని ఉండనీయండి అన్నది అత్యధిక శాతం ప్రజల మాటగా కచ్చితంగా ఉంటుంది.

ఎందుకంటే లేని దాని కంటే ఉన్నది బెటర్ అన్నది ఎపుడూ నిమయ్యే నీతిగా ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే వైసీపీ ఊహలకు చంద్రబాబు తెలివైన రాజకీయంతో చెక్ చెప్పేసారు అన్న మాట. ఇపుడు ఆయన మూడు రాజధానుల బిల్లు ఎందుకు వైసీపీకి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి జనంలో తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తున్నారు.

ఇది మరో కొత్త ఎత్త్తుగడ. ఏపీలో ఈ రోజుకీ ఏ కోశానా అభివృద్ధి అన్నదే లేని పరిస్థితి. దాంతో ఇపుడు కనుక అసెంబ్లీ రద్దు అంటూ అధికార పార్టీ ఆవేశపడితే పుట్టె మునగడం ఖాయం. అయితే జనాలు తమ వైపు ఉన్నారనుకుని జగన్ కనుక టెమ్ట్ అయితే కచ్చితంగా అది చంద్రబాబుకే ప్లస్ అవుతుంది. మొత్తానికి ఏపీలో నాటకీయ పరిణామాలే ముందు ముందు చాలా ఉంటాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.