Begin typing your search above and press return to search.
లోకేష్ వి చిన్నపిల్లాడి చేష్టలా!
By: Tupaki Desk | 10 Aug 2019 5:13 PM ISTవరద బాధిత ప్రాంతానికి వెళ్లినప్పుడు అయినా డేర్ గా మీడియా ముందు మాట్లాడతాడని లోకేష్ వీరాభిమాన సంఘాలు ఆశించాయి. అయితే లోకేష్ వాళ్లకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ ఆ పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం అయిన లోకేష్ బాబు ఇంకా మీడియా ముందుకు వచ్చే ధైర్యం చేయడం లేదు.
లోకేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అది ధైర్యం చేయడం కాదు, సాహసం చేయడం అవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. లోకేష్ లో ఇంకా డెవలప్ మెంట్ ఏమీ లేదని వారు అంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అంటే అలా గడిచిపోయింది. అప్పుడు భజన చేయడానికి మీడియా ఉండింది. పార్టీ చేతిలో అధికారం ఉండింది. అయితే ఇప్పుడు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత లోకేష్ మీదే ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా లోకేష్ మీడియా ముందుకు వచ్చే సాహసం చేయకపోవడం సమంజసంగా లేదని పరిశీలకులు అంటున్నారు.
నెలలు గడుస్తున్నా చంద్రబాబు నాయుడి తనయుడు కేవలం ట్విటర్ కే పరిమితం అయ్యాడు. ఆ ట్వీట్లు ఎవరో రాసిస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. ఎవరో కంటెంట్ రైటర్ ట్వీట్లు రాస్తే వాటిని పోస్టు చేసి అదే రాజకీయం అని లోకేష్ ఫీలయితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.
ప్రజలకు భరోసా ఇచ్చే సంగతెలా ఉన్నా లోకేష్ మీడియాను ఫేస్ చేసి కనీసం తన పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నూరిపోయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ లోకేష్ లో అలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. రాజకీయం అంటే వెకిలి ట్వీట్లు పెట్టడం అని లోకేష్ అనుకుంటున్నాడు. అలా అనుకుంటే ట్విటర్లోనూ, ఫేస్ బుక్ లోనూ బోలెడన్ని పోస్టులు పెట్టి ఫాలోయర్లను సంపాదించుకునే వాళ్లే పెద్ద రాజకీయ నేతలు కావాలి. ఈ విషయాన్నిగ్రహించకుండా లోకేష్ చిన్నపిల్లాడి చేష్టలు చేస్తున్నాడని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.