Begin typing your search above and press return to search.

అమెరికా సీన్ః చంద్రబాబుకు ఫోన్ వాడటం కూడా రాదా?

By:  Tupaki Desk   |   3 Aug 2019 6:49 AM GMT
అమెరికా సీన్ః చంద్రబాబుకు ఫోన్ వాడటం కూడా రాదా?
X
మాటెత్తితే భారత దేశంలో సెల్ ఫోన్ వాడటానికి తనే కారణం అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు. అలా చెప్పుకోవడం చంద్రబాబుకు కొత్త కాదు. టెక్నాలజీని తనే కనిపెట్టినట్టుగా, ఇండియాలో ఐటీ ఇండస్ట్రీని ప్రారంభించింది తనే అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ మాటలను ప్రజలు ఎలా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. అందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు ఇప్పుడు సొంతంగా ఫోన్ వాడాల్సిన అవసరం పడుతోందట. ఇటీవలి ఎన్నికల ముందు వరకూ ఐదేళ్లూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పుడంతా మందీమార్బలం వెంట ఉండేది. ఏ పనీ సొంతంగా చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆ హడావుడి ఉండదు కదా. దీంతో సొంతంగా ఫోన్ వాడాల్సి వస్తోందట.

అందులో భాగంగా చంద్రబాబు నాయుడు అమెరికా టూర్లో ఒక ఐఫోన్ వాడుతున్నారట. ఫొటోలో ఉన్నట్టుగా చేతిలో ఫోన్ పట్టుకుని వెళ్తున్నారట. అలా తన సానుభూతి పరులైన ఎన్ఆర్ఐలతో కలిసి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు తిరిగారు. పాప్ కార్న్ తింటూ వారితో కలిసి షికార్లు చేశారట. ఆ సమయంలో ఉన్నట్టుండి ఫోన్ లో అలర్ట్ టోన్ వచ్చింది.

అది ఎందుకో..ఏమిటో.. అర్థం చేసుకోవడం చంద్రబాబుకు సాధ్యం కాలేదట. ఫోన్ ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా తెలియలేదట. దీంతో పక్కనున్న వారు ఫోన్ ఓపెన్ చేసి..మెసేజ్ వచ్చిందని వివరించారట. ఇలా చంద్రబాబుకు టెక్నాలజీ మీద ఉన్న పట్టేమిటో తెలిసిపోయిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి!