Begin typing your search above and press return to search.

చంద్రబాబును అడ్డుకున్నది ఎవరు ?

By:  Tupaki Desk   |   2 March 2021 6:30 AM GMT
చంద్రబాబును అడ్డుకున్నది ఎవరు ?
X
ఇపుడిదే ఆంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారపార్టీ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున చిత్తూరు, తిరుపతిలో ఆందోళన చేయాలని తెలుగుదేశంపార్టీ నిర్ణయించింది. తమ ఆందోళనలకు అనుమతివ్వాలంటూ రెండు చోట్లా టీడీపీ నేతలు ఎస్సీలను అనుమతి అడిగారు. అయితే ఎస్పీలు అనుమతి నిరాకరించారు. తిరుపతిలో బస్టాండ్-రైల్వేస్టేషన్ మధ్యలో ఉన్న గాంధి విగ్రహం బాగా రద్దీగా ఉండే ప్రాంతం. అలాగే చిత్తూరులో గాంధి ఏరియా అంటే పట్టణంలో బాగా జనసమ్మర్ధం ఉండే ఏరియా. కాబట్టి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. పై రెండు మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఆందోళనలు, నిరసనలకు అనుమతులు ఇవ్వటం కుదరదని ఎస్పీలు స్పష్టంగా చెప్పారు. అయినా వినకుండా చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. దాంతో చంద్రబాబును పోలీసులు విమానాశ్రయం లాంజ్ లోనే అడ్డుకున్నారు. దాంతో మండిపోయిన చంద్రబాబు పోలీసులపై నోటికి పనిచెప్పారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ప్రాధమిక హక్కులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటు చంద్రబాబు పోలీసులను నిలదీశారు. తనను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదంటు మండిపోయారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. తనను పోలీసులు అడ్డుకున్నందకు నిరసనగా లాంజ్ లోనే మధ్యాహ్నం నుండి కూర్చుని నిరసన తెలుపుతున్నారు.

అంతా బాగానే ఉంది చంద్రబాబు నిలదీయాల్సింది ఎన్నికల కమీషన్నే కదా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకు పోలీసులు కమీషన్ పరిధిలోనే పనిచేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అన్నీ విషయాలు తెలిసిన చంద్రబాబు, అచ్చెన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆడిపపోసుకోవటంలో అర్ధమేంటి ? చంద్రబాబును అడ్డుకున్నది ఎన్నికల కమీషనే కానీ ప్రభుత్వం కాదు. మరి చంద్రబాబు అండ్ కో ప్రభుత్వంపై మండిపడితే ఉపయోగమేంటి ?