Begin typing your search above and press return to search.
అద్దెల్లు వదిలి బాబు మకాం మారిందెక్కడికంటే?
By: Tupaki Desk | 27 Jun 2019 7:40 AM GMTచేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అని ఊరికే అనలేదు. చేతిలో ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా.. అవసరమైన వాటిని వదిలేసి.. అనవసరమైన వాటితో అదేపనిగా సమయాన్ని వృధా చేసిన తీరు చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు. ఏపీ ముఖ్యమంత్రిగా విభజన నేపథ్యంలో అమరావతిలో ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత బాబుపై ఉంటుంది.
అయినప్పటికి అదేమీ పట్టించుకోని ఆయన.. హైదరాబాద్ లో పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇంటిని కట్టించుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలా? పొరుగున ఉన్న రాష్ట్రంలో తనకొక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలా? ఇంత చిన్న విషయాన్ని ఆలోచించని బాబు.. ఏపీ సీఎంగా అద్దె ఇంట్లోనే ఐదేళ్లుగా నివాసం ఉంటున్న ఆయన.. తన సొంతానికి భవనం నిర్మించుకోకపోవటాన్ని ఏమనాలి?
తాజాగా బాబు అద్దెకు ఉంటున్న భవనం అక్రమ నిర్మాణంగా తేల్చిన ఏపీ ప్రభుత్వం దాన్ని కూలగొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చేసిన జగన్ ప్రభుత్వం.. తర్వాత బాబు నివాసం మీదనే కూలగొట్టాలన్న పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోఅక్రమ నివాసంలో ఉండటం కూడా తన లాంటి నేతకు బాగుండదన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. తాజాగా ఇంటిని ఖాళీ చేసేందుకు తయారైనట్లుగా తెలుస్తోంది.
కామినేని ఆసుపత్రి ఎదురుగా ఉన్న గ్రావెల్ ఇండియా గెస్ట్ హౌస్ ను తాత్కాలిక నివాసంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. పవర్ లో ఉన్నప్పుడు సొంతింటిని ఏర్పాటు చేసుకొని ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదేమో?