Begin typing your search above and press return to search.

నిత్యానంద భారత్ లో అడుగుపెడితే కరోనా ఖతమట

By:  Tupaki Desk   |   8 Jun 2021 10:00 PM IST
నిత్యానంద భారత్ లో అడుగుపెడితే కరోనా ఖతమట
X
నిత్యానంద స్వామి .. కామ క్రీడలతో హీరోయిన్ తో చేసిన ఈయన పనులు వైరల్ అయ్యాయి. అవన్నీ మీడియాకు చిక్కి రచ్చరచ్చ అయ్యాయి. దీంతో పాటు ఆయనపై కేసులు నమోదు కావడంతో ఎవరికి తెలియకుండా పారిపోయాడు.

దక్షిణ అమెరికా ఖండంలోని పశ్చిమ తీరంలో ఈక్వెడార్ అనే బుల్లి దేశంలో ప్రస్తుతం ఈ నిత్యానంద స్వామి తలదాచుకుంటున్నాడు. ఈ దేశంలోని ఓ చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి ‘కైలాస’ అనే పేరు పెట్టి దాన్ని సొంత దేశంగా మార్చేశాడు. పాస్ పోర్ట్, జెండా, జాతీయ చిహ్నం, కేబినెట్ కూడా ఏర్పాటు చేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ఏర్పాటు చేశాడు.

తాజాగా ఓ శిష్యుడు నిత్యానందుడిని కరోనా భారత్ ను ఎప్పుడు విడిచి వెళుతుందని అడిగినప్పుడు ఆసక్తిగా స్పందించాడు. తాను ఎప్పుడైతే భారత్ లో అడుగుపెడుతానో అప్పుడే కరోనా అంతమవుతుందని చెప్పడం విశేషం. ఇండియా, బ్రెజిల్, మలేషియాతోపాటు యూరోపియన్ దేశాల నుంచి కైలాసానికి ప్రయాణాలను బ్యాన్ చేస్తున్నట్లు ఆ దేశాల ఎంబసీలకు అత్యవస లేఖ కూడా రాశాడు.