Begin typing your search above and press return to search.
ప్రస్తుతం టీవీ9లో పరిస్థితి ఎలా ఉంది దేవి.?
By: Tupaki Desk | 13 May 2019 2:50 PM ISTఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడ నిమిషాల్లో వాలిపోతుంది టీవీ9 యాంకర్ కమ్ రిపోర్టర్ దేవి. శ్రీలంక బాంబుపేలుళ్లు, పుల్వామా అటాక్.. సిట్యువేషన్ ఏదైనా సరే.. దేవి అక్కడ ప్రత్యక్షం అవ్వాల్సిందే. దీంతో.. దేవిపై సోషల్ మీడియాలో బోలెడన్నీ ట్రోల్స్ అవుతూనే ఉంటాయి. ఇక సినిమాల్లో కూడా టీవీ9 ప్రస్తావన వచ్చిన ప్రతీసారి దేవీ పేరు కూడా విన్పిస్తుంది. మరి ఇప్పుడు టీవీ9లో సంక్షోభం ఉంది. ఇలాంటి సమయంలో.. అక్కడినుంచి దేవీ రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం (సరదా ప్రయత్నం)
ప్రస్తుతం టీవీ9 అంతా ప్రశాంతంగానే ఉంది. ప్రతీరోజూ వచ్చినట్లుగానే ఉద్యోగులు వస్తున్నారు, వెళ్తున్నారు. గత మేనేజ్ మెంట్ కంటే ప్రస్తుతం కొత్తగా వచ్చి యాజమాన్యం మేలని ఉద్యోగులంతా భావిస్తున్నారు. అయితే.. మొన్న రవిప్రకాష్ టీవీ9లో కన్పించిన రోజు మాత్రం ఉద్యోగులు ఆయనకు బాసటగా ఉంటామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి తెలిసేసరికి అంతా ఫ్లేటు ఫిరాయించారు. ఇంచార్జుల దగ్గరనుంచి ఉద్యోగులు వరకూ ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. ఎవ్వరైతే మనకేంటి.. మనం పని మనం చేసుకుపోవాలని అనుకుంటున్నారు. మరోవైపు.. ఇద్దరు హెచ్ వోడీలు, మరో ఇద్దరు యాంకర్లు కొన్నాళ్ల తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని వార్తలు రావడంతో.. వారిపై అలందా మీడియా ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. మరోవైపు.. కొత్త మేనేజ్ మెంట్ ఉదయం, సాయంత్రం మీటింగ్ లు పెడుతోంది. అన్నింటికి మించి నిన్నసాయంత్రం రజనీకాంత్, మురళీకృష్ణతో పాటు యాంకర్లు, ఔట్ పుట్ ఎడిటర్స్, షిఫ్ట్ ఇంచార్జులు అందరూ మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావుని కలిశారు. ఇప్పుడున్న టీమ్ తోనే తాము టీవీ9ని నడుపుతామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారంతా హ్యాపీగా ఆఫీస్ కు వస్తున్నారని తెలుస్తోంది. మొన్న రవిప్రకాశ్ వచ్చినప్పుడు నానా హడావుడి చేసిన కొంతమంది ఉద్యోగులు కూడా ఇప్పుడు కిమ్మనకుండా కొత్త మేనేజ్‌మెంట్ పొగుడుతూ.. ఉద్యోగాలు చేసుకుంటున్నారనే విషయం స్పష్టం అర్థం అవుతుంది. కెమెరాపర్సన్ తో దేవీ, టీవీ 9. ఓవర్ టు స్టూడియో.
(కొందరు నుంచి మాకు తెలిసిన సమాచారం ఆధారంగా సరదాగా చేసిన ఈ ప్రయత్నం. కించపరచడం మా ఉద్దేశం కాదు. టీవీ9 ల్యాండ్ మార్క్ రిపోర్టింగ్ స్టైల్లో టీవీ9 వార్తను చెప్పే ఓ సరదా ప్రయత్నం)