Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు చెప్పిన 'పీ-4' ఫార్ములా ఏంటి?

By:  Tupaki Desk   |   28 April 2023 5:00 PM GMT
చంద్ర‌బాబు చెప్పిన పీ-4 ఫార్ములా ఏంటి?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ప‌ల్నాడు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 'పీ-4' ఫార్ములా అంటూ.. ఒక దానిని ప్ర‌క‌టించారు. నాలుగు రోజుల కింద‌ట కూడా.. ఒక‌ సంచ‌ల‌న విష‌యం చెబుతున్నానంటూ.. త‌న పుట్టిన రోజు నాడుఒక ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలో అంద‌రినీ సంప‌న్నుల‌ను చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని వివ‌రించారు. ఈ ప‌రంప‌ర‌లో తాజాగా 'పీ-4' ఫార్ములా అంటూ..చెప్పుకొచ్చారు.

దీంతో అస‌లు పీ-4 ఫార్ములా అంటే ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. సమాజంలో పైకి వచ్చిన వారు మరికొందరికి ఊతమివ్వటమే 'పీ-4' ఫార్ములా ఉద్దేశమని చంద్రబాబు వెల్లడించారు. పేదరిక నిర్మూలన కోసం తాము అధికారంలోకి రాగానే 'పీ-4' ఫార్ములా అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

ఈ ఫార్ములా ప్రకారం పేదలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అమరావతి పీ 4 ఫార్ములాకు ప్రత్యక్ష ఉదాహరణ అని వెల్లడించారు.

సింగపూర్, దుబాయ్ని అక్కడి పాలకులు స్వర్గంలా మార్చారన్న చంద్రబాబు..ఇక్కడి పాలకులు అమరావతిని శ్మశానంలా మార్చారని మండిపడ్డారు. జగన్ వద్ద ఉన్న‌ డబ్బు తీసుకుంటే ఒక్కో బూత్లో ఒకరిని కోటీశ్వరులను చేయొచ్చని ఎద్దేవా చేశారు. పేదలను ధనిక కుటుంబాలుగా చేసే బాధ్యత తనదని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏంటీ పీ-4
పీ1 = పీపుల్‌
పీ2 = పోవ‌ర్టీ
పీ3 = ప్రాప‌ర్టీ
పీ4 = పంపిణీ

అంటే.. స‌మాజంలోని ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా పేద‌రికంలోఉన్న ప్ర‌జ‌లు ఒకింత సంపాయించుకున్న ప్ర‌జ‌లు.. పంపీణి చేయ‌డ‌మే.. పీ-4 ఫార్ములా ఉద్దేశంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీనిని ఆయ‌న అధికారంలోకి రాగానే అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.