Begin typing your search above and press return to search.
చంద్రబాబు భేటీకి ముందు కొండా ఫ్యామిలీలో ఏం జరిగింది?
By: Tupaki Desk | 13 Jun 2023 5:00 AM GMTఉన్నది ఉన్నట్లు చెప్పటం.. నిర్మోహమాటంగా మాట్లాటం.. మనసు లో ఒకటి.. బయట కు ఒకటి అన్నట్లు కాకుండా.. కన్నింగ్ అన్నది తమకు ఉండదని చెప్పేయటమే కాదు.. అలాంటి తీరు ను ప్రదర్శించే రాజకీయ కుటుంబాల్లో ప్రముఖమైనది కొండా మురళి.. సురేఖ దంపతులది. వారి తీరు పై ఎన్నో విమర్శలు.. ఆరోపణలు ఉన్నా.. అడగాలే వాటన్నింటికి తాము జవాబులు ఇస్తామనటమే కాదు.. చెప్పే తీరు వారి లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరైన వారు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
చంద్రబాబు తమను పార్టీ లోకి రావాలని కోరారని.. ఆ సందర్భంగా ఏమైందన్న ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఒకసారి తమ తో మాట్లాడేందుకు చంద్రబాబు పిలిచారన్న సురేఖ.. "చంద్రబాబు పిలిచారు. కలవాలన్నారు. దీంతో ఇంట్లో చర్చ జరిగింది. మనం ఆ పార్టీలో చేరనప్పుడు కలవటం అవసరమా? అని మురళి అన్నారు. మనం జాయిన్ కావటం.. కాకపోవటం అన్నది తర్వాత. అంత సీనియర్ మనల్ని పిలిచినప్పుడు వెళ్లాలి. మాట్లాడాలి. పార్టీలో చేరటం.. చేకపోవటం మన ఇష్టం అని నేను చెప్పా. దీంతో.. మురళి వెళ్లారు. మీలాం టోళ్లు ఉండాలి మురళి. మీలాంటి లీడర్ కావాలని చంద్రబాబు అన్నారు" అని చెప్పారు.
ఇదే సమయం లో మాట్లాడిన కొండా మురళి.. 'దయాకర్ ఉన్నప్పుడు నేను పార్టీ లోకి ఎందుకు వస్తానని అడిగాడు. ఇక్కడ 23 ఆత్మలు ఉన్నాయి. అవి ఏడుస్తాయిన చెప్పా. దీని కి చంద్రబాబు బదులిస్తూ.. ఆయన పార్టీ నుంచి వెళ్లి పోతాడు. టీఆర్ఎస్ తో మాట్లాడుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత నేను పార్టీ లోకి రాలేనని చెప్పా' అని పేర్కొన్నారు. తమ ఇంట్లో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. తాను.. మురళి.. మురళి సోదరుడు.. తన కుమార్తె నలుగురం కూర్చొని ఒక మాట అనుకుంటామని.. అందుకే తమ మధ్య ఎలాంటి విభేదాలు రావని చెప్పారు కొండా సురేఖ.
నక్సలైట్ల తో కలిసి ఉండే పోలీసు లతో పంచాయితీ రాలేదా? అన్న ప్రశ్న కు బదులిస్తూ.. ఒకసారి పోలీసులు కూంబింగ్ కు వెళ్లినప్పుడు.. అన్నల్ని మురళి కలిసి వస్తున్న విషయాన్ని టీం లీడర్ గా ఉన్న ఒక పోలీసులు అధికారి గమనించారు. నక్సల్స్ తో ఎదురైతే వాళ్ల తో పాటు మురళి ని కూడా చంపేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. అయితే.. మురళి తో ఉన్న సాన్నిహిత్యంతో ఆ అధికారి ఆయన ను కాపాడారంటూ కొండా సురేఖ వెల్లడించారు. తాను రాజకీయంగా ఎదిగానంటే అందు కు 50 శాతం క్రెడిట్ పోలీసులదైతే.. మిగిలిన 50 శాతం నక్సలైట్ల వల్లేనని వ్యాఖ్యానించటం గమనార్హం.
తాను నక్సల్స్ ను కలిసి ఇంటి కి వచ్చిన తర్వాత పోలీసు అధికారి ఒకరు తన ఇంటికి వచ్చారన్న కొండా మురళి.. "మందు బాటిల్ ఉందారా అని అడిగాడు. ఇద్దరం కూర్చొని మందు తాగుతున్నాం. నీకేమైనా బుద్ది ఉందా? నేను గంట తండ్లాడితే నువ్ బయట కు వచ్చావని తిట్టాడు" అని చెబుతూ.. జాగ్రత్తగా ఉండాల ని సూచన చేసినట్లుగా మురళి వెల్లడించారు. ఎర్రబెల్లి తన పై టాడా కేసు పెట్టించి జైల్లో పెట్టించాడని.. అదే ఆయన తో పంచాయితీకి కారణమన్న మురళి.. అతడో మేక వన్నె పులి గా అభివర్ణించారు. ఎర్రబెల్లి కారణంగా తనకున్న 300 ఎకరాల్లో నాలుగేళ్లుగా ఫిషరీష్ వేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి మీద గెలవకుంటే.. తాను రాజకీయాల్ని మానేస్తానని వ్యాఖ్యానించటం గమనార్హం.