Begin typing your search above and press return to search.
తూర్పు పర్యటనతో జనసేనకు వచ్చిందేంటి..?
By: Tupaki Desk | 12 May 2023 9:00 PM GMTతూర్పుగోదావరి జిల్లాలో పవన్ తాజాగా పర్యటించారు. అయితే ఈ పర్యటన వల్ల ఒరిగింది ఏంటి అనే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా వర్షాలు కురిసి.. పంట నష్టపోయినటువంటి రైతులకి ఏ ప్రభుత్వమైనా సహాయం చేసేందుకు రెండు మూడు రోజులు సమయం తీసుకుంటుంది. అదేవిధంగా ఏపీలోను రెండు మూడు రోజులు సమయం పట్టింది. గత ప్రభుత్వాలైన ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అయినా ఒకే విధమైనటువంటి నిబంధనలను అనుసరిస్తుంది.
కాకపోతే చెల్లించేటటువంటి మొత్తాల్లో కొంత పెంపు కొంత తగ్గింపు అనేది సర్వసాధారణం. ఈ రకంగా చూసుకున్నప్పుడు వైసిపి కూడా సమయానుకూలంగానే స్పందించింది అనేది వాస్తవం. కానీ దీన్ని రాజకీయంగా కొంత వాడుకోవాలని సాధారణంగా ప్రతిపక్షాలు చేసేటటువంటి ప్రయత్నం. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చి చూసి వెళ్లారు. తదనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా పర్యటించారు.
అయితే పవన్ కళ్యాణ్ రైతులను ఓదార్చింది పెద్దగా ఏమీ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు రైతులను ఓదార్చాలి అనేది ప్రధానంగా పెట్టుకుంటారు.
అయితే ఇక్కడ ఓదార్చడం కన్నా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ పరంగా ఆయనతమకు సాయం ప్రకటిస్తారని రైతుల్లో కనిపించే కానీ ఆశ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ నుంచి ఎక్కడ కనిపించలేదు.
ఎక్కడా ఏమీ ఆయన ప్రకటించకుండానే వెళ్లిపోయారు. దీనిపై తూర్పుగోదావరిలో చర్చ నడుస్తోంది. ఎంతమంది నాయకులు వచ్చినా తను ఏమీ జరగలేదని రైతులు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం గమనార్హం. అదే సమయంలో ప్రభుత్వం స్పందించింది అనేది వాస్తవం. ఇది ప్రతిపక్షాలను చూసి స్పందించిందా లేకపోతే చేయాలి అనేటటువంటి పద్ధతితోనే స్పందించిందా ఏదైనా కూడా ప్రభుత్వం కొంత ఇక్కడ చేసిందని చెప్పాలి.
ప్రభుత్వం వల్ల రైతుల లబ్ధి పొందుతున్నారా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే కొంత ఇప్పుడైతే మేలు జరిగింది. న్యాయం జరిగిందనేది వాస్తవం. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా కనుక సాయం చేసినట్లయితే మేలు జరిగేది రైతులకి తద్వారా పార్టీ పరంగా కూడా మంచి గ్రాఫ్ పెరిగేది అనేటటువంటి చర్చ జనసేన వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం.