Begin typing your search above and press return to search.

అర్ధ రాత్రి అరెస్టులో మ‌త‌ల‌బేంటి?

By:  Tupaki Desk   |   11 Feb 2022 3:32 AM GMT
అర్ధ రాత్రి అరెస్టులో మ‌త‌ల‌బేంటి?
X
ఎప్ప‌టి నుంచో ఏపీ ఎన్జీఓ సంఘ మాజీ నేత మ‌రియు ఎమ్మెల్సీ అశోక్ బాబు వివాదాల్లో ఉన్నారు.ఆ విధంగా ఆయ‌న త‌నదైన రాజకీయం ఒక‌టి న‌డుపుతున్నారు.స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల్లో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు అశోక్ బాబు.త‌రువాత చంద్ర‌బాబే స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయించి మ‌రీ! ఎమ్మెల్సీ ఇచ్చారు.ఇప్పుడీయ‌న టీడీపీకి పెద్ద‌దిక్కు.ఇదే స‌మ‌యంలో వైసీపీకి కౌంట‌ర్లు ఇవ్వడంలో కూడా ఇప్పుడిప్పుడే అశోక్ బాబు కొంచెం మాట్లాడ‌డం నేర్చుకుంటున్నారు.

ఇక స‌ర్వీసు రిజిస్ట‌రులో త‌ప్పుడు డిగ్రీ స‌ర్టిఫికెట్ ఉంచి వివాదంలో ఇరుక్కున్న ఆయ‌న‌ను సీఐడీ పోలీసులు అర్ధ‌రాత్రి అరెస్టు చేశారు.దీంతో ఇప్పుడు జ‌గ‌న్ పై టీడీపీ మండిప‌డుతోంది.క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా ఆ రోజు చ‌క్రం తిప్పిన ఆయ‌న ఉద్యోగం చేస్తూ కూడా టీడీపీకి అనుబంధంగా ఉండేవారు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఆ బంధం కార‌ణంగానే ఉద్యోగులు అడిగినవ‌న్నీ చంద్ర‌బాబు ఆ రోజు కాద‌న‌లేక‌పోయారు అన్న మాట కూడా వాస్తవ‌మే! ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక నాటి కేసును తిర‌గ‌దోడింది.అయితే ఇది పాత క‌థే! ఎందుకంటే ఎప్ప‌టి నుంచో అశోక్ బాబు స‌ర్వీసు రిజిస్ట‌ర్ పై అనుమానాలు ఉన్నా కూడా గ‌తంలో ఎన్న‌డూ అవి తెర‌పైకి రాలేదు.

ఇప్పుడీయ‌న టీడీపీ కండువా క‌ప్పుకుని రాజ‌కీయం చేస్తుండ‌డంతో ఒక్క‌సారిగా వైసీపీ త‌న‌దైన పంథాలో పాత కేసును తవ్వింది. ఇది కూడా త‌ప్పు కూడా కాదు. ఎందుకంటే రాజ‌కీయంలో భాగంగానే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్నారా అంటే అది అంగీకరించ‌లేం ఎందుకంటే ఆయ‌న చేసిన త‌ప్పిదాల‌పై గ‌తంలో ఉద్యోగులే ఇంకా చెప్పాలంటే క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఉద్యోగులే బాహాటంగా గ‌ళం విప్పారు.సీఐడీ పోలీసులు అర్ధ‌రాత్రి అరెస్టు ఎందుకు చేశారంటే కాస్తో కూస్తో క్రేజ్ కోసం త‌ప్ప‌! మ‌రొక‌టి కాదు.

ఆ రోజు ఉద్యోగంలో ఉంటూ టీడీపీకి ఊడిగం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఆయ‌న త‌న సచ్ఛీల‌త‌ను నిరూపించుకోవాలి. అంటే ఆ డిగ్రీ స‌ర్టిఫికెట్ అన్న‌ది త‌ప్పుడు ధ్రువ‌ప‌త్రం కాద‌ని నిరూపించుకోవాలి. అది ఇప్ప‌టికిప్పుడు సాధ్యం

అయ్యే ప‌ని కాదు. క‌నుక అశోక్ బాబు ఈ కేసును ఎదుర్కోవాల్సిందే. ఓ విధంగా టీడీపీకి ఇది ప్రాణ సంక‌ట స‌మ‌యం.మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీన్నొక త‌ప్పుడు కేసుగానే చూస్తున్నారు.అయితే గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో అర్ధ‌రాత్రి అరెస్టులు లేవా అంటే ఉన్నాయి. కానీ వైసీపీ వ‌చ్చాక తొలిసారి టీడీపీ నేత‌పై మ‌రింత ప‌ట్టుబ‌ట్టి అరెస్టుల‌కు ఉప‌క్ర‌మించడం.ఓ విధంగా ఇది జ‌గ‌న్ విప‌క్షాల‌కు స్ప‌ష్టంగా ఇస్తున్న సంకేత‌మే! ఇప్పుడు నిరూపించుకోవాల్సింది అశోక్ బాబు.

ఇప్పుడు త‌ప్పులు లేవు చేయ‌లేదు అని చెప్పాల్సింది ఆధార స‌హితంగా మాట్లాడాల్సింది అశోక్ బాబే! "స‌మైక్య ఉద్య‌మాల స‌మ‌యంలో ఇదే అశోక్ బాబు పాపం టీడీపీ నాయ‌కుల‌పై కుర్చీలు ఎత్తించాడు..ఇప్పుడు టీడీపీ గూటికి చేరి డ్రామా న‌డిపిస్తున్నాడు..? వావ్ వారెవ్వా వాట్ ఏ స్క్రీన్ ప్లే " అని అంటోంది వైసీపీ వ‌ర్గ ఉద్యోగ సంఘం.