బిజినెస్ చేయడం అనేది ఒక కళ. మార్కెటింగ్ అనేది పేద్ద ఆర్ట్. అది నేర్చుకుంటే రాదు. ఎడారిలోకి వెళ్లి ఇసుక అమ్మగలిగిన వాడే అసలైన మగాడు అని మార్కెటింగ్ సూత్రాలు చెప్తున్నాయి. అలాంటి సూత్రాలన్నీ అణువణువునా వంటబట్టించుకున్న వ్యక్తి.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.
శూన్యంలోంచి అవకాశాలు సృష్టించడం, చేసిన పనిని ప్రమోట్ చేసుకోవడంతో.. చంద్రబాబుని మించిన పొలిటీషీయన్ భారత్ లో లేడు. పేరుకి చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అనే కానీ ఆయన పనిచేసే తీరు అంతా కార్పొరేట్ సీఈఓలా ఉంటుంది. ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతీ క్షణం చేస్తున్న పనిని బేరీజు వేసుకోవడం, టార్గెట్స్ ఫిక్స్ చేయడం.. అన్నింటికి మించి డిజిటల్ టెక్నాలజీని ప్రతీదానికి అనుసంధానించడం.. ఇవన్నీ చంద్రబాబు ప్లస్ పాయింట్స్.
చంద్రబాబు మార్కెటింగ్ ప్రతిభకు మచ్చుతునకు లాంటి ఒక ఉదాహరణ నిన్నటి కియా మోటార్స్ ట్రైల్ రన్ కార్యక్రమంలో జరిగింది. నిన్నటి కార్యక్రమానికి కియా మోటర్స్ అధినేత.. పార్క్ కూడా హాజరయ్యారు. సభలో ఉండగానే పార్క్ ని సౌత్ కొరియాకి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్క్ కూడా మొదట షాక్ అయినా.. ఆ తర్వాత ఆనందంగా ఒప్పుకున్నారు. దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్క్ వల్ల దక్షిణ కొరియాలో ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయన మరో నాలుగైదు ఇండస్ట్రీలకు తీసుకురాగలడు. ఇవన్నీ ఊహించిన చంద్రబాబు.. పార్క్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. చంద్రబాబు మార్కెటింగ్ చాతుర్యానికి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.