Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ..చైనా సృష్టేనా ?

By:  Tupaki Desk   |   29 Jan 2020 11:03 AM GMT
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ..చైనా సృష్టేనా  ?
X
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచా దేశాలని గడగడలాడిస్తున్న అత్యంత ప్రాణాంతకమైన వైరస్. ఈ వైరస్ చైనాలోని వుహాన్ అనే పట్టణంలోని సముద్రపు ఆహార మార్కెట్ నుంచి వ్యాప్తి చెందినట్టుగా నిపుణిలు చెప్తున్నారు. అదే సమయంలో గబ్బిలం వంటి పక్షి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సహజంగానే పుట్టుకొచ్చిందా.. లేక చైనానే బయో వెపన్ గా దీన్ని తయారుచేసిందా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే, తాజాగా వాషింగ్టన్ టైమ్స్ దీనిపై సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. అలాగే ఫేస్‌బుక్,వాట్సాప్‌ ఇతరత్రా సోషల్ మీడియాలోనూ కరోనాపై అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఇంటలిజెన్స్ అధికారి కరోనా వైరస్‌పై చేసిన వ్యాఖ్యలను వాషింగ్టన్ టైమ్స్ ప్రచురించింది. కరోనా వైరస్ ఓ బయోలాజికల్ వెపన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. వుహాన్ పుట్టణంలోని 'వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' అనే ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీక్ అయినట్టు ఆయన చెప్పారు.

ఆ ల్యాబ్‌లో చైనా చాలా కాలంగా సీక్రెట్ బయోలాజికల్ వెపన్‌ను తయారుచేస్తున్నట్టుగా తెలిపారు. చైనా మిలటరీ కోసమే దీన్ని తయారుచేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన ప్రదేశంగా భావిస్తున్న వుహాన్‌లోని సీ ఫుడ్ మార్కెట్‌ కు ఈ వైరాలజీ ల్యాబ్ 25-30కి.మీ దూరంలోనే ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ ఆరోగ్య సంస్థ దీన్ని ధ్రువీకరించలేదు.

కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో మరో ఆసక్తికర కథనం కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. చైనాకు చెందిన ఓ సైంటిస్ట్ జంట కెనడాలోని విన్నిపెగ్‌లోని మైక్రో బయాలజీ ల్యాబ్‌లో చాలా కాలంగా పరిశోధనలు జరుపుతోంది. అయితే గతేడాది నిబంధనల ఉల్లంఘన కారణంగా ఆ జంటతో పాటు వారి స్టూడెంట్స్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఆ సైంటిస్ట్ జంట అక్కడి ల్యాబ్‌లో వారు తయారుచేస్తున్న కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్ పట్టణంలో ఉన్న ల్యాబ్‌కి పంపించారని చెబుతున్నారు. అయితే వుహాన్ వైరాలజీ ల్యాబ్‌ లో పనిచేస్తున్న సైంటిస్టులకు ఆ వైరస్‌ను ఎలా డీల్ చేయాలో తెలియక పోవడం తో.. అది బయట కు లీకైందని అంటున్నారు.

ఇకపోతే , చైనాలో కరోనా వైరస్ కారణం గా ఇప్పటి వరకు 132 మంది చనిపోయినట్టు అధికారిక సమాచారం. అలాగే 5974 మందికి కరోనా సోకినట్టు,మరో 9329 అనుమానిత కేసులు నమోదైనట్టు చైనా వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉందని వుహాన్‌కి చెందిన ఓ నర్సు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చైనాలో ఇప్పటివరకు దాదాపుగా 90వేల మందికి కరోనా వైరస్ సోకినట్టుగా ఆమె తెలిపారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని తక్షణం ప్రత్యేక ప్రదేశానికి తరలించి చికిత్స అందించాలని, లేదంటే ఒక్కో పేషెంట్ ద్వారా అది 14మందికి వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.