Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో : జగన్ బీజేపీ గోడుదొంగలేనా...?

By:  Tupaki Desk   |   29 July 2022 9:47 AM GMT
వైరల్ వీడియో : జగన్ బీజేపీ గోడుదొంగలేనా...?
X
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ పాలిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదు, వేటికవే సెపరేట్ గా ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఏపీ జనాలు ఎంతవరకూ నమ్ముతున్నరో లేదో తెలియదు కానీ అమరావతి రైతులు మాత్రం అసలు నమ్మడంలేదు. బీజేపీ ఆద్వర్యాన మనం మన అమరావతి పేరిట ఒక కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించింది.

దాదాపుగా డెబ్బై అయిదు రోజుల పాటు అమరావతి రాజధాని వీధుల్లో బీజేపీ నేతల పాదయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా రాజధానిలో పాదయాత్రను ప్రారంభించిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అక్కడ ఉన్న జనాల మద్దతు కోసం వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు.

మాటా మంతీ కూడా చేసారు. అయితే అక్కడ ఉన్న ఒక వృద్ధుడు మాత్రం బీజేపీ జగన్ తోడుదొంగలే అంటూ షాకింగ్ కామెంట్స్ సోము వీర్రాజు ఎదుట చేయడం సంచలనం రేపింది.

మీ ఇద్దరే కదా కూడబలుక్కుని ఈ రాష్ట్రాన్ని ఇట్టా చేశారు అంటూ మండిపడ్డాడు. అయితే ఈ విమర్శలు నేరుగా తననే తాకడంతో సోము వీర్రాజు ఒక్కసారిగా షాక్ కి గురి అయి ఇబ్బంది పడ్డారు. అంతే కాదు ఆ వృద్ధుడికి జవాబు చెప్పే ప్రయత్నం చేశారు.

అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబుని ఏమీ అనకుండా మమ్మల్ని అనడమేంటి అని కూడా సోము అన్నారు. కేంద్రం రాజధాని కోసం ఏకంగా పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది అని కూడా సోము చెప్పుకొచ్చారు.

సరే సోము తన వాదన తాను వినిపించి ఉండవచ్చు కాక కానీ బీజేపీ మీద జగన్ మీద అమరావతి రైతులకు ఉన్న భావం ఏంటో, వారి అభిప్రాయం ఏంటో ఒక వృద్ధ రైతు మాటల్లో తేలిపోయింది. మొత్తంగా చూస్తే అమరావతి రైతులు బీజేపీని అసలు నమ్మడంలేదు జగన్ విషయంలో వారు గుర్రుగా ఉన్నారన్నది లోక విధితమే. ఇక ఆ వృద్ధుది సాహసానికి డేరింగ్ గా తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన దానికి జనాలు ఒక్క లెక్కన ఫిదా అవుతున్నరు. సోషల్ మీడియాలో ఆ వృద్ధుడు కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయిపుడు.