Begin typing your search above and press return to search.

వైరల్ పోస్టు: ఆత్మనిర్భర భారత్ అంటే ఇదా!

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 AM GMT
వైరల్ పోస్టు:  ఆత్మనిర్భర భారత్ అంటే ఇదా!
X
సృజనశీలురు తమలోని ఆవేదనను అక్కసును వెళ్లగక్కేస్తున్నారు. ఇన్నాళ్లు వారికో మాధ్యమం అంటూ లేదు. జర్నలిస్టులు రాసిందే మీడియా, పత్రికల్లో చూసేవారు. కానీ అసలు నిజాలను తమ కోణంలో ఆవిష్కరింపచేసే ఆయుధాలు లేకుండేవి. కానీ సోషల్ మీడియా వచ్చాక ఇప్పుడు టీవీ, ప్రింట్ మీడియాను మించి దున్నేస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా.. పీఠాలు కదిల్చేలా ఎదిగింది. అందుకే కేంద్రంలోని బీజేపీ కూడా సోషల్ మీడియాను కట్టడి చేసేలా చట్టాలను నూరుతోంది.

తాజాగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారు. అక్కడా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థలు వాటి ఘనతను వివరిస్తూ మోడీ సర్కార్ ను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందులోని ఒక పోస్టును పరిశీలిద్దాం..

‘‘ *1954 లో ఉక్కు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం SAIL ని స్థాపించారు.
*1956 లో ఇంజనీరింగ్ విద్యలో స్వయం సమృద్ధి సాధించడం IIT లని స్థాపించారు..
*1956 లో వైద్యరంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం AIIMS ని స్థాపించారు...
*1958 లో రక్షణ సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం DRDO ని స్థాపించారు...
*1964 లో వైమానిక రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం HAL ని స్థాపించారు...
*1965 లో ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం హరిత విప్లవాన్ని తెచ్చారు...
*1965 లో ఎలక్ట్రికల్ వస్తువుల ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం BHEL ని స్థాపించారు.....
*1969 లో అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం ISRO ని స్థాపించారు.
*1975 లో బొగ్గు ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం CCL ని స్థాపించారు...
*1975 లో విద్యుదుత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసం NTPC ని స్థాపించారు...
*1984 లో గ్యాస్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం GAIL ని స్థాపించారు....
*1990 లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో స్వయం సమృద్ధి సాధించడం కోసం softwear పార్కును సృష్టించారు.
ఇలా ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు పురుడుపోసుకున్నాయి.
........
ఇంతలో.. 2014 లో మోడీ వచ్చి.. దేశం "స్వయం సమృద్ధి"ని సాధించాలంటే.. వాటినన్నిటినీ అమ్మేయాలని.. కార్పొరేట్లకు కట్టబెట్టాలని తేల్చేసాడు!!

ఇంతకన్నా దేశద్రోహం ఏముంటుంది? భారత్ మాతాకీ జై అంటూ ...భరతమాత వంటిమీద భూషణాలుగా ఉన్న ప్రజా సంపద (పబ్లిక్ సెక్టార్)ని దేశ విదేశీ కార్పోరేట్ నేరగాళ్ళతో కలసి కొల్లగొట్టడం, జనం దృష్టిని చైనా, పాకిస్తాన్ వైపు మళ్ళించి దేశభక్తుల్లా ఫోజు కొట్టడం!.. ఆహా హా.. ఏమి దొంగ దేశభక్తి మీది!!’’

అంటూ ఓ సృజనశీలి కేంద్రంలోని మోడీ సర్కార్ పై సంధించిన వైరల్ పోస్టు ఇదీ..