Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో కిరణ్ బేడీకి చేదు అనుభవం
By: Tupaki Desk | 20 Nov 2017 10:40 AM ISTఅప్పగించిన పనిని ఎవరికి అభ్యంతరకంగా లేకుండా చేయటం అంత ఈజీ కాదు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తప్పులు చేస్తుంటారు. తాజాగా అలాంటి తప్పులే చేస్తున్నారన్న విమర్శల్ని మూటగట్టుకుంటున్నారు ఐరెన్ లేడీగా సుప్రసిద్ధులు.. పుదుచ్చేరి గవర్నర్ గా పాపులర్ అయిన కిరణ్ బేడీ.
ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి.. ఎమ్మెల్యేగా సైతం గెలవలేని ఆమెకు అవకాశం ఇస్తూ మోడీ అండ్ కో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమెను పుదుచ్చేరి గవర్నర్ గా నియమించారు. గవర్నర్ గిరి అంటే రబ్బర్ స్టాంప్ గా మిగిలిపోవటం ఇష్టం లేని ఐరెన్ లేడీ తన సత్తాను చాటే ప్రయత్నం చేశారు.
పుదుచ్చేరి అధికారపక్షానికి మింగుడు పడని రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా గవర్నర్ గిరిని నడపటంపై అక్కడి అధికారపక్షం అసంతృప్తికి గురి అవుతోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా పుదుచ్చేరిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించేందుకు గవర్నర్ కిరణ్ బేడీ తాజాగా పర్యటించారు. ఈ సందర్భంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వీకెండ్ లలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల్ని.. పరిశుభ్రతా చర్యల్ని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అదే పని చేయాలని భావించిన ఆమెను గో బ్యాక్ అంటూ స్థానిక ప్రజలు నినాదాలు చేయటం షాకింగ్ గా మారింది. ఆమెను అడ్డుకుంటూ ప్రజల వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. అయితే.. ఈ ఉదంతం పుదుచ్చేరి అధికారపక్షానికి మాత్రం సంతోషాన్ని కలిగించటం ఖాయం.