Begin typing your search above and press return to search.
మెగా హీరో రోడ్డు ప్రమాదంపై విజయసాయిరెడ్డి స్పందన ఇదే
By: Tupaki Desk | 11 Sept 2021 4:51 PM ISTరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యువ హీరో సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు.
సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ నడుపుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. మరోవైపు, సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి కారణం అతి వేగమేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ పుటేజ్ కూడా బయటకు వచ్చింది.
అందులో అదుపుతప్పడం వల్లే బైక్ మీద నుంచి తేజూ కిందపడ్డట్టు కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కు చాతి, కన్ను, భుజాలకు గాయాలయ్యాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ ఇప్పటికే ప్రకటనలు చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తున్నారు. తేజ్ త్వరగా కోలుకోవాలని సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితర ప్రముఖులు ట్వీట్లు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో మీడియాలో విభిన్న కథనాలు వస్తుండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకుంది. ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.