Begin typing your search above and press return to search.
పాక్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర రెండు బాల్స్
By: Tupaki Desk | 22 March 2016 10:18 AM ISTవినేందుకు విచిత్రంగా అనిపించినా తాజాగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. భారత్.. పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో చోటు చేసుకున్న ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. తీవ్ర ఆశ్చర్యానికి కలిగిస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ లో 16వ ఓవర్లో.. పాక్ బౌలర్ నిదాదార్ వేసిన బంతిని వేదా కృష్ణమూర్తి బలంగా కొట్టింది. బంతి బౌండరీ లైన్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని ఆపేందుకు పాక్ మహిళా క్రికెటర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ సమయంలో వారు కాస్తంత షాక్ కు గురయ్యారు. ఎందుకంటే.. బౌండరీ లైన్ వద్ద వారికి రెండు బంతులు కనిపించాయి. బౌండరీ లైన్ వద్ద కనిపించిన రెండు బంతుల్లో మ్యాచ్ లో వాడిన బంతిని గుర్తించి బౌలర్ కు ఇచ్చారు.
ఇలా గ్రౌండ్ లో రెండు బంతులున్న విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన విషయాన్ని ఆంగ్ల మీడియా ఒకటి తాజాగా బయటకు తీసుకురావటంతో.. ఈ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ బౌండరీ దగ్గర రెండు బాల్స్ ఎందుకు ఉన్నట్లు..?