Begin typing your search above and press return to search.

రెండో రోజూ రణరంగం..కొట్టేసుకున్న గులాబీ.. కమలం దండు

By:  Tupaki Desk   |   17 Nov 2021 12:17 PM IST
రెండో రోజూ రణరంగం..కొట్టేసుకున్న గులాబీ.. కమలం దండు
X
మాటలు అనుకోవటం.. ఘాటు విమర్శలు చేసుకోవటం లాంటి దశల్ని దాటిపోయాయి తెలంగాణ అధికార టీఆర్ఎస్.. విపక్ష బీజేపీ శ్రేణులు. గతంలో మరెప్పుడూ లేని రీతిలో రెండు పార్టీల మధ్య పోరు ఇప్పుడు ముఖాముఖిగా మారటమే కాదు.. రాళ్లతో పెద్ద ఎత్తున దాడులు చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.

దీంతో.. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు.. బీజేపీకి చెందిన పలువురు రాళ్ల దాడిలో గాయపడ్డారు. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు రాళ్ల దెబ్బలు తప్పలేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు.. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు పరిస్థితుల్ని సమీక్షించేందుకు గడిచిన రెండు రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు పార్టీల శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రైతుల వద్దకు బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో.. ఇరు పార్టీల శ్రేణుల మధ్య రాళ్ల దాడి పెద్ద ఎత్తున జరగటం.. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. తన రెండో రోజు పర్యటనలో భాగంగా బండి సంజయ్ సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట.. చివ్వెంల.. ఆత్మకూరు మండలాల్లోని ఐకేపీ.. పీఏసీఎస్ కేంద్రాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగాటీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వారిని కంట్రోల్ చేసేందుకు రాళ్ల దాడికి ప్రయత్నించటం.. ఇరు వర్గాల మధ్య రచ్చ మొదలై.. శాంతిభద్రతల సమస్యగా పరిగణించే పరిస్థితి.

టీఆర్ఎస్.. బీజేపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా ఇరు పార్టీలకు చెందిన పలువురు గాయపడటమే కాదు.. పెద్ద ఎత్తున వాహనాలు సైతం ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాల్ని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు సైతం తీవ్ర ఇబ్బందికి గురైనట్లుగా తెలుస్తోంది. తన పర్యటనలో ఎదురైన పరిణామాలపై టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. గడిచిన రెండు రోజులుగా తాను ఫోన్ చేస్తుంటే.. ఆయన లిఫ్టు చేయటం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నా తగినట్లుగా స్పందించలేదన్నారు.

ఇదిలా ఉంటే.. తమపై దాడి చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణుల నుంచి రక్షించే ఏర్పాట్లు చేయలేదని.. తమపైనే కేసులు పెడుతున్నారని.. టీఆర్ఎస్ నేతల మీదా నమోదు కాలేదంటున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా టీఆర్ఎస్ కార్యకర్తల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.

ఇదిలాఉంటే తాజాగా బండి సంజయ్ నల్గొండ టూర్ ను ముగించుకొని బుధవారం రాత్రి తిరుమలగిరి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన మళ్లీ వెంటనే కరీంనగరర్ కు బయలుదేరి వెళ్లారు.

ఇక..ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ ముందస్తు అనుమతి తీసుకోకుండా.. శాంతిభద్రతలకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ పైనా..టీఆర్ఎస్.. బీజేపీ శ్రేణులపైనా కేసుల్ని నమోదు చేస్తామంటున్నారు. మొత్తంగా మొదటి రోజుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రెండో రోజు కూడా బండి సంజయ్ పర్యటన తీవ్రమైన ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పక దప్పదు.