Begin typing your search above and press return to search.

దసరా వేళ రూ.వెయ్యి కోట్ల మద్యం తాగేశారు

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:47 AM GMT
దసరా వేళ రూ.వెయ్యి కోట్ల మద్యం తాగేశారు
X
తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరా వేళ.. అందుకు తగ్గట్లే మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగిన వైనం చూస్తే.. ఈ పండుగ వేళ మద్యం వినియోగం ఎంతలా పెరిగిందో ఇట్టే అర్థమవుతుంది.

కేవలం ఏడు రోజుల అమ్మకాలు ఏకంగా రూ.వెయ్యి కోట్లు దాటేసి ఏకంగా రూ.1100 కోట్ల మార్కును టచ్ చేయటం గమనార్హం.

సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5తో ముగిసిన వారంలో రెండు రోజులు సెలవులు వచ్చాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా.. అక్టోబరు 5న దసరా. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మద్యం డిపోలకు సెలవులు.

అయినప్పటికీ.. రికార్డు స్థాయిలో రూ.1100 కోట్ల అమ్మకాలు సాగటం విశేషం.ఈ అమ్మకాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది.

తర్వాతి స్థాయిలో వరంగల్ అర్బన్ రూ.149.02 కోట్లు.. నల్గొండ రూ.124.44 కోట్లు.. కరీంనగర్ రూ.111.44 కోట్లు.. హైదరాబాద్ జిల్లా రూ.108.24 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగాయి. లిక్కర్ వర్సెస్ బీర్ అమ్మకాల్ని చూస్తే.. సెప్టెంబరు 3న 3.68 లక్షల మద్యం కేసులు అమ్ముడైతే.. బీర్ మాత్రం 45,502 కేసులు మాత్రమే అమ్ముడు కావటం గమనార్హం.

అయితే.. అక్టోబరు ఒకటిన మాత్రం లిక్కర్ కేసులు 46 వేలు అమ్ముడైతే.. బీర్ కేసులు 2.54 లక్షలు అమ్ముడయ్యాయి. దసరా పండుగ ఏమో కానీ.. తెలంగాణలో మద్యం ఏరులై పారిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.