Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు వ‌రంగా మారిన ప్ర‌తిప‌క్షం దూకుడు!

By:  Tupaki Desk   |   18 Sept 2020 7:00 AM IST
జ‌గ‌న్‌ కు వ‌రంగా మారిన ప్ర‌తిప‌క్షం దూకుడు!
X
సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నా.. ఏదో ఒక రూపంలో ప్ర‌తిప‌క్షం టీడీపీ అడ్డు ప‌డుతోంది. ఆయ‌న‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌గా.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేశారో.. అచ్చు అలానే ఇప్పుడు టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. విమ‌ర్శ‌లు కూడా సంధిస్తోంది. అయితే, ఈ విమ‌ర్శ‌లు.. దూకుడు వంటివి ప్ర‌తిప‌క్షానికి మార్కులు తెచ్చేలా ఉంటే బాగానే ఉండేది. కానీ, విమ‌ర్శ‌లు చేసిన వారి చుట్టూతానే ప్ర‌జ‌లు వేలు పెట్టి చూపించేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తిప‌క్షం టీడీపీపై చాలా వ్య‌తిరేక ప్ర‌భావం క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు కీల‌కంగా భావిస్తున్న అనేక ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడ్డుకుంది. కొన్నింటిని న్యాయ స్థానాల రూపంలోనూ అడ్డుకుని అడ్డుక‌ట్ట వేయించింది. మ‌రికొన్నింటిని త‌న అనుకూల మీడియాలో ప్ర‌చారం చేయ‌డం ద్వారా.. అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇలాంటి వాటిలో కీల‌క‌మైన‌వి.. పేద‌ల‌కు ఇళ్లు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియాన్ని తీసేసి ఇంగ్లీషు మీడియం ప్ర‌వేశ పెట్ట‌డం, అదేవిధంగా మూడు రాజ‌ధానుల విష‌యం.

ఆయా అంశాలు.. రాజ‌కీయంగా ఓటు బ్యాంకును తీవ్రంగా ప్ర‌భావం చేయ‌గ‌లిగే స్థాయిలో ఉన్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కూడా మేలు చేసే అంశాలే. ఈ క్ర‌మంలో.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ఆయా ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు అడ్డుపుల్ల‌లు వేస్తూనే ఉంది. అయితే, దీనివ‌ల్ల టీడీపీ పొందిన ల‌బ్ధి ఏదైనా ఉందా? అంటే.. ప్ర‌శ్నార్థ‌కమే స‌మాధానంగా మారింది. పేద‌ల‌కు ఇళ్ల‌ను అడ్డుకున్నారు. దీంతో ``బాబు అడ్డు ప‌డ‌క‌పోతే.. మాకు జ‌గ‌న్‌ ఇల్లు ఎప్పుడో ఇచ్చేవాడు`` అనే టాక్ వ‌చ్చేలా చేసింది. ఇక‌, తెలుగు మీడియంపైనా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీంతో.. ``ఏమో.. అంతా చంద్ర‌బాబే చేస్తున్నాడు. లేక‌పోతే.. ఈ పాటికే జ‌గ‌న్ ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ పెట్టేవాడు``-అని అన్ని స్థాయిల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌, మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ టీడీపీ తీసుకున్న స్టాండు మంచిదో చెడో.. ప‌క్క‌న పెడితే.. ఒక్క‌సారి ఈ ఆలోచ‌న వ‌చ్చిన త‌ర్వాత‌.. అటు విశాఖ‌, ఇటు క‌ర్నూలులో ఆశ పుట్టంది. ``ఏదైతే అదే అవుతుంది.. రాజ‌ధాని వ‌స్తానంటే.. కాదంటామా?!`` అని విశాఖ , క‌ర్నూలు వాసులు అనుకున్నారు. కానీ, ఇది ఇప్ప‌ట్లో తేలేలా లేద‌ని తెలియ‌డంతో వారు కూడా బాబు వైపే వేళ్లు చూపిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. ప్ర‌తిప‌క్షంగా బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని చూస్తున్నా.. స‌రైన విధానం లేకుండా సాగుతున్న ఈ వ్య‌తిరేక‌త‌.. ఆఖ‌రుకు ఆయ‌న‌కే న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోప‌క్క‌, జ‌గ‌న్ కు ఈ విష‌యంలో ఎలాంటి మ‌ర‌క‌లూ అంట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా బాబు మార‌తారో లేదో చూడాలి.