Begin typing your search above and press return to search.

టీడీపీ, వైసీపీల్లో స్లోగ‌న్ల రాజ‌కీయాలు...!

By:  Tupaki Desk   |   22 Dec 2022 1:30 AM GMT
టీడీపీ, వైసీపీల్లో స్లోగ‌న్ల రాజ‌కీయాలు...!
X
మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. లేదా.. సీఎం జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళ్లాల‌ని అనుకుంటే.. వెంట‌నే ఎప్పుడైనా ఎన్నిక‌లు రావొచ్చు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తారా? లేదా.. అనే విష‌యం క‌న్నా కూడా..ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. రెడీ అంటూ టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది. అదేస‌మ‌యంలో వైసీపీ షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లకు రెడీ అవుతున్న‌ట్టు చెబుతోంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేందుకు తాప‌త్ర‌యం ప‌డుతున్న టీడీపీ.. అధికా రం నిల‌బెట్టుకునేందుకు వ్యూహాల‌తో ముందుకు సాగుతున్న వైసీపీలు.. ప్ర‌జ‌లను త‌మ‌వైపు తిప్పుకొనేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాలంటే.. మంచి స్లోగ‌న్లు కావాలి.. మంచి మంచి క్యాప్ష‌న్ల‌తో ప్ర‌జ‌ల నోళ్ల‌లో నానేలా ఉండాలి. ఇప్పుడు వీటిపైనే ఈ రెండు పార్టీలు కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఇలా మంచి మంచి స్లోగ‌న్ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాయి. ''జాబు కావాలంటే.. బాబు రావాలి''-'మ‌ళ్లీ మీరే రావాలి'- వ‌స్తున్నా మీ కోసం-వంటి నినాదాల‌తో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌జ‌ల‌కు చేరువైంది.

దీంతో ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుస‌రించింది. రావాలి జ‌గ‌న్-కావాలి జ‌గ‌న్‌-ఒక్క ఛాన్స్‌, నేను విన్నాను-నేను ఉన్నాను-అన్న వ‌స్తున్నాడు వంటి నినాదాల‌తో ముందుకు సాగింది.

ఇలానే ఇప్పుడు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రెండు పార్టీలూ స్లోగ‌న్ల‌పై దృష్టి పెట్టాయి. క్షేత్ర స్థాయిలో నాయ‌కుల‌కుఈ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అదేస‌మ‌యంలో సినీ రంగంలో క‌వులు, ర‌చ‌యిత‌ల‌కు కూడా ఆయా పార్టీల‌నుస‌మ‌ర్థించేవారికి మంచి స్లోగ‌న్లు ఇవ్వాల‌ని విన్న‌వించిన‌ట్టు స‌మాచారం. అయితే,ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో ప్ర‌స్తుతానికి కీల‌క‌మైన స్లోగ‌న్లు ఏవీ కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఏదేమైనా.. రెండు పార్టీలు కూడా ప్ర‌జా క‌ర్ష‌ణ‌లో చాలా ముందున్నాయ‌నేది వాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.