Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఆడిస్తున్నాడు.. టాలీవుడ్ ప్రముఖలపై బాబు ఫైర్
By: Tupaki Desk | 2 April 2019 10:14 AM GMTటాలీవుడ్ సినీ ప్రముఖులు తాజాగా వరుసగా వైసీపీలో చేరడం.. టీడీపీపై వరుస విమర్శలు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వారిపై సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు పిరికివాళ్లు, వలసపక్షలు అంటూ ఆడిపోసుకున్నారు. కేసీఆర్ భయపెట్టో.. లేక ప్రోద్బలంతోనో టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రా బాట పడుతున్నారని.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా వస్తూ ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ లో చాలా మంది టాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు జీవిస్తున్నారని.. వారి ఆస్తులు, అలిగేషన్స్ అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని.. అందుకే కేసీఆర్ చెప్పినట్టు ఏపీపై దండయాత్ర చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీకి మద్దతివ్వాలని హైదరాబాద్ లోని టాలీవుడ్ ప్రముఖుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారని.. ఒకవేళ కాదని టీడీపీకి మద్దతిస్తే హైదరాబాద్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరిస్తోందని బాబు ధ్వజమెత్తారు.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్రంగానే ఈ కుట్ర జరుగుతోందని.. కేసీఆర్ బెదిరింపులతోనే టాలీవుడ్ నటులు భయపడి ఆంధ్రాకొస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ టాలీవుడ్ సినీ ప్రముఖులను నమ్మరని.. తెలంగాణ విడిపోయాక కూడా ఏపీకి రాకుండా హైదరాబాద్ లో నివసిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పై ఎటువంటి ప్రేమ లేదని.. వారంతా వలసపక్షలంటూ చంద్రబాబు మండిపడ్డారు. 'ఈ వలస పక్షుల ప్రచారంలో నమ్మకం లేదు. వారు ఆంధ్రాలో ఉండరు.. వారు ఎన్నికల తర్వాత హైదరాబాద్ కు వెళతారు.. ఈ వలస పక్షులు ఇప్పుడు ఆంధ్రా రాష్ట్రానికి వచ్చి వైసీపీ తరుఫున పోటీచేయడానికి కేసీఆర్ భయపెట్టడమే కారణమని '' టాలీవుడ్ నటులపై చంద్రబాబు నిప్పులు కురిపించారు.
కాగా చంద్రబాబు ఆరోపణలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఒక పార్టీకి, ఒక వ్యక్తికి మద్దతు ఇవ్వడం అనేది వారి వారి వ్యక్తిగత ఇష్టాలు, విచక్షణపై ఆధారపడి ఉంటుందని.. ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తారో వారికి మద్దతుగా నిలవడంలో పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదని కౌంటర్ ఇస్తున్నారు.
కాగా టాలీవుడ్ మొత్తం తనకు పేటెంట్ గా చంద్రబాబు భావిస్తున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు టాలీవుడ్ రావడంలో మామ ఎన్టీఆర్ కృషి చేశారని.. అందువల్ల అంతా తనకే మద్దతుగా నిలబడాలని భావిస్తున్నట్టున్నాడు. అయితే టాలీవుడ్ తరలిరావడంలో ఎన్టీఆర్ తోపాటు చాలా మంది కృషి ఉంది దాన్ని బాబు ఖాతాలో వేసుకోవడం.. వారిందరినీ తనకే మద్దతు ఇవ్వడం మూర్ఖత్వం అని పలువురు సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండడంతో చంద్రబాబు తన విమర్శల వాడిని పెంచారు. టాలీవుడ్ ప్రముఖులు వరుసగా వైసీపీలో చేరడం.. ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఇలా ఆడిపోసుకుంటున్నారు.