Begin typing your search above and press return to search.

టీడీపీ 40వ పుట్టిన రోజు.. బాల‌య్య సందేశం ఇదే

By:  Tupaki Desk   |   29 March 2022 10:30 AM GMT
టీడీపీ 40వ పుట్టిన రోజు.. బాల‌య్య సందేశం ఇదే
X
ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న తెలుగుదేశం ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అన్న‌గారు ఎన్టీఆర్‌ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి కంచుకోట అని అభివర్ణించారు. లక్షలమంది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సుల కారణంగానే నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతుందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్తశకం లిఖించిందని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో "టీడీపీకి ముందు, టీడీపీకి తర్వాత" అని చూసేలా చేసిందని.. చరిత్రను తిరగరాసిందని బాలయ్య వెల్లడించారు. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో సాధించిన ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు.. టీడీపీ వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యిందన్నారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్తశకం లిఖించిందని బాల‌య్య చెప్పారు. నాలుగు దశాబ్దా లుగా పసుపుజెండా రెపరెపలాడుతోందంటే.. లక్షల మంది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణమ‌ని అన్నారు.

ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయింద‌న్నారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టిందిటీడీపీనేని తెలిపారు. "ఎత్తిపోతల పథకాలతో అన్నపూర్ణ అయిందంటే టీడీపీ ఘనతే. పారిశ్రామికీకరణకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టారు." అని బాల‌య్య కొనియాడారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల మానసపుత్రిక తెలుగుదేశం పార్టీ అని బాల‌య్య పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే టీడీపీ రథచక్రాలుగా అభివ‌ర్ణించారు. టీడీపీ ప్రగతిరథానికి కార్యకర్తలే చోదకశక్తులుగా పేర్కొన్నారు.

400 ఏళ్లైనా టీడీపీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంద‌న్నారు. దుష్ట శక్తులెన్ని ఆటంకాలు కల్పించినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామ‌ని చెప్పారు. "పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్‌కు మనం అందించే నివాళి అదే" అని బాల‌య్య స్ప‌ష్టం చేశారు.