Begin typing your search above and press return to search.

చంద్రబాబు మీటింగ్ 52/250

By:  Tupaki Desk   |   26 Sep 2020 3:36 PM GMT
చంద్రబాబు మీటింగ్ 52/250
X
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం అయిన చంద్రబాబు ఊరికే కూర్చోకుండా కరోనా టైంలో కూడా ఏదో ఒక పనిచేయాలని శ్రేణులను ఆదేశిస్తున్నాడట.. చంద్రబాబు ఏమో ఇంట్లోనే జూమ్ లో ఆదేశిస్తాడట.. కానీ నాయకులు మాత్రం వీధిపోరాటాలు చేసి కేసులు పెట్టించుకోవాలంట.. ఇదీ చంద్రబాబు తీరు అని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

అసలు విషయానికి వస్తే.. ప్రతీ మంగళవారం చంద్రబాబు తన ఇంటి నుంచి జూమ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 175 నియోజకవర్గాల ఇన్ చార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఆఫీస్ బేరర్లు ఇలా అంతా కలిపి 250మంది వరకు లైన్లో దింపి మాట్లాడుతూ వారిని పార్టీ కోసం పనిచేయాల్సిందిగా సమాయత్తపరుస్తుంటాడంట..

అయితే ఇది గత నెల నుంచి జరుగుతూ ఉందని సమాచారం. మొదట్లో చంద్రబాబు జూమ్ మీటింగ్ కు బాగానే అటెండెన్స్ ఉండేదంట... రాను రాను తగ్గుతూ మొన్నటి మంగళవారానికి మరీ తక్కువ అయ్యి ఏకంగా 250 మంది నుంచి 52మందికి పడిపోయిందంట.. అందులో టీడీపీ ఆఫీస్ బేరర్సే 20 మంది ఉన్నారట.. అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి 32మంది మాత్రమే హాజరు అయ్యారంట..

ఎందుకు బాబు మీటింగ్ కు అంతమంది డుమ్మా కొట్టారని ఆరాతీస్తే.. ‘కరోనా టైంలోనూ చంద్రబాబు వదలడం లేదని.. ప్రతీవారం ఏదో ఒక హోంవర్క్ ఇచ్చినట్టు ఇస్తూ ఆ ధర్నాలు చేయండని.. ఏదో ఒక పని చెబితే ఎవరు వస్తారని’ నేతలు అసలు మీటింగ్ లకే హాజరు కావడం లేదట.. అయినా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ లు జూమ్ లో మస్తు చెప్తారని.. గ్రామాలకు పోతే తెలుస్తది అసలు బాధ అని నేతలు ఆఫ్ ది రికార్డ్ వాపోతున్నారట.... ఇక్కడ వైసీపీ వాళ్లకు ఎదురు వెళుతూ మేము కేసులో పెట్టుకోవాలా? అని నేతలంతా లోలోపల రగిలిపోతున్నారట.. అందుకే ఎమ్మెల్యేలు దాదాపు 5శాతం కూడా బాబు జూమ్ మీటింగ్ కు హాజరు కాకుండా ఇన్ చార్జులు కూడా చాలా తక్కువమంది అటెండ్ అవుతున్నారట..

ఇన్ చార్జీలు కొత్త వాళ్లను మినహాయిస్తే చంద్రబాబును నమ్మి ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు అంట.. ఎందుకు అని ఆరాతీస్తే ‘చివరి వరకు పనిచేయించుకొని లాస్ట్ లో సీటు ఇవ్వకుండా చంద్రబాబు హ్యాండ్ ఇస్తాడని.. సీట్ల కేటాయింపు అప్పుడు సీట్ల మాఫియా వచ్చి డబ్బులకు అమ్ముతారని... అలాంటప్పుడు అప్పుడే ఏం తొందర అని కూడా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఆలోచన చేస్తున్నారంట..

ఇలా బాబు ఏపీకి రాకుండా.. ఆయన జూమ్ లో ఇచ్చే ఆదేశాలకు స్పందన కరువవుతోందట.. చూస్తుంటే టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందంట.... చూద్దాం వచ్చే మంగళవారం బాబు జూమ్ మీటింగ్ కు హాజరు ఎలా ఉంటుందో?