Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు టీడీపీ పుంజుకుంటుందే.. ప‌బ్లిక్ టాక్‌

By:  Tupaki Desk   |   1 Dec 2021 9:00 AM IST
ఎట్ట‌కేల‌కు టీడీపీ పుంజుకుంటుందే.. ప‌బ్లిక్ టాక్‌
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకుంటుందా? అని ఏ ఇద్ద‌రు ప్ర‌శ్నించుకున్నా.. వ‌చ్చే స‌మాధానం.. ఏమో తెలియ‌ద‌నే! అయితే.. ఇప్పుడు..పార్టీ ప‌రిస్థితి మారింది. గ‌తానికి భిన్నంగా.. పార్టీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. నిజానికి 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్రానికి వేగుచు క్క‌గా మారిన చంద్ర‌బాబు.. అనూహ్య‌మైన విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌ర్వాత కాలంలో ఆయ‌న వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా.. పార్టీ అధికారానికి దూర‌మైంది.

ముఖ్యంగా జంపింగుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం.. పార్ట‌లో సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోక‌పోవడం.. వంటివి.. చంద్రబాబుకు.. పార్టీకి కూడా ఇబ్బంది క‌లిగించాయ‌న‌డంలో సందేహం లేదు. అదేస‌మ‌యంలో నేత‌ల‌కు అప్పాయింట్‌మెంట్లు ఇవ్వ‌క‌పోవ‌డం.. అధికారుల‌తో నిరంత‌రం స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం వంటివి కూడా పార్టీ నేత‌ల‌ను.. చంద్ర‌బాబుకు దూరం చేసింది. దీంతో ఒక వ్యూహం లేకుండానే..గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే భారీ దెబ్బ త‌గిలింది.

ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స్థానిక‌, ఉప‌ ఎన్నిక‌ల్లో కూడాటీడీపీ గెలుపు గుర్రం ఎక్కిన దాఖ‌లాలేదు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కుల మ‌ధ్య చురుకు క‌నిపించ‌లేదు. టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు అనేక కార్య‌క్ర‌మాల‌కు పిలుపునివ్వ‌డం.. జ‌గ‌న్‌పై యుద్ధానికి రెడీ అవ‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు క‌లివిడిగా రాలేదు. దీంతో ఇక‌, పార్టీ ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో.. తాజాగా అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌.. చంద్ర‌బాబు మీడియాముందు క‌న్నీరుపెట్టుకోవ‌డం.. వంటి ఘ‌ట‌న తర్వాత‌.. టీడీపీలో అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.

నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ సంఘ‌టితం అవుతు్న్నారు. చంద్ర‌బాబుకు జ‌రిగిన అవ‌మాన క‌ర ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గానే తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గౌర‌వ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ఇది ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ అయితే.. మ‌రో వైపు.. ప‌రోక్ష కార్యాచ‌ర‌ణ‌ను కూడా టీడీపీ ముందుకు తీసుకువెళ్తోంది. సోషల్ మీడియాను ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. `ఐ`-టీడీపీ విభాగం ఏర్పాటు చేసి.. సోష‌ల్ మీడియా ద్వారా.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను వారికి వివ‌రించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

అదేవిధంగా జంపింగుల‌కు ఇక‌, చెక్ పెడ‌తామ‌ని.. చంద్ర‌బాబు చెప్ప‌డం ద్వారా.. పార్టీలో ఉన్న‌వారికి ప‌ద‌వులు ఇస్తామ‌నే.. సంకేతాలు బ‌లంగా పంపించిన‌ట్టు అయింది. అదేస‌మ‌యంలో.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండేలా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించారు సో.. ఈ ప‌రిణామాల‌నుఅంచ‌నా వేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. టీడీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌నే బ‌ల‌మైన వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.