Begin typing your search above and press return to search.

అతి చేసినా అన‌ర్థ‌మే బాబూ!!

By:  Tupaki Desk   |   16 Dec 2022 3:00 PM IST
అతి చేసినా అన‌ర్థ‌మే బాబూ!!
X
'అతి' అన్ని విధాలా అన‌ర్థం! ఇది రాజ‌కీయాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఎందుకంటే.. ఇక్క‌డ కూడా అనేక సెంటిమెంట్లు.. ఉప‌మానాలు వంటివి కామ‌న్‌. సో.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ అధినేత నుంచి కింది స్తాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. వారు చేసుకుంటున్న ప‌నులు కావొచ్చు.. లేదా .. ప్ర‌తిప‌క్షాల రాజ‌కీయాలు కావొచ్చు..ఏదేమైనా, వైసీపీ నేత‌ల‌పై నిత్యం విమ‌ర్శ‌ల మోత మోగుతోంది.

వీటిని ఆదిలో ఆస‌క్తిగా ఉన్న ఏపీ ప్ర‌జ‌లు త‌ర్వాత త‌ర్వాత పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం మానేశారని.. వైసీపీలో కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. అంటే.. తిన‌గ తిన‌గ వేము తీయ‌నుండు.. అన్న‌ట్టుగా.. అధికార‌ప‌క్షంపై విమ‌ర్శ‌లు వినీ వినీ ప్ర‌జ‌ల‌కు అల‌వాటైనా అయిపోయి ఉండాలి. లేదా.. ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేద‌ని అయినా అనుకుంటూ ఉండాలి. మొత్తానికి ఇప్పుడు మెజారిటీ ప్ర‌జ‌ల్లో వైసీపీ నేత‌లు ఇదే నూరిపోశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంటే.. త‌మ‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను న‌మ్మొద్ద‌ని త‌మ ప్ర‌భుత్వం రావ‌డం.. 'కొంద‌రికి' ఇష్టం లేద‌ని అందుకే ప్ర‌జ‌ల‌కు ఇంత పెద్ద సంక్షేమం చేస్తున్న త‌మ‌ను టార్గెట్ చేసుకున్నార‌ని.. ప‌దే ప‌దే సీఎం జ‌గ‌న్ అనేక స‌భ‌ల్లో చెబుతున్నారు.

ఇక‌, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌చారం చేస్తున్నా రు. దీంతో రాష్ట్రంలో చాప కింద నీరులా ఈ చ‌ర్చ కూడా సాగుతోంది. వైసీపీని, సీఎంను కావాల‌నే అంటున్నార‌నే చ‌ర్చ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ‌గా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకానీ, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ కానీ, చేప‌ట్టే యాత్ర‌ల్లో వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు.. చేయ‌డానికి మాత్ర‌మే ఆయా యాత్ర‌ల‌ను వినియోగిస్తే.. ప్ర‌యోజ నం క‌ష్ట‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏదైనా స‌బ్జెక్టుఉండి.. అంత వ‌ర‌కు విమ‌ర్శిస్తే ఫ‌ర్లేదు కానీ, అంత‌కు మించి అతిగా విమ‌ర్శ‌లు చేసినా.. లేనిపోని వ్యాఖ్య‌లు చేసినా.. దానికి కొంత సెంటిమెంటును పూసి.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ మ‌రో వ్యూహం రెడీ చేసింద‌నే వాద‌న స్ప‌ష్టంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.