Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌లంతా టీడీపీ వెనుకే.. ఈ ప్ర‌చారం వెనుక‌..?

By:  Tupaki Desk   |   1 Dec 2021 2:00 PM IST
ప్ర‌జ‌లంతా టీడీపీ వెనుకే.. ఈ ప్ర‌చారం వెనుక‌..?
X
ఏపీ టీడీపీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ పుంజుకుంద‌ని.. భారీ ఎత్తున‌.. ప్ర‌జ‌లు హార‌తులు ప‌డుతు న్నార‌ని. .పెద్ద ఎత్తున‌.. ఓ వ‌ర్గం మీడియాలో ప్రచారం ప్రారంభ‌మైంది. ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌ర‌గిన అవ‌మానం ఘ‌ట‌న.. అనంత రం.. చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డం.. వంటి విష‌యాల త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుందేనే అభిప్రాయాన్ని ఆయా క‌థ‌నాలు వెల్ల‌డి స్తున్నా యి. అంతేకాదు.. సోష‌ల్ మీడియాను ద‌న్నుగా చేసుకుని టీడీపీ ముందుకు సాగుతోంద‌ని చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యం.. టీడీపీకి మ‌రింత పుంజుకునేందుకు వ‌న‌రుగా మారింద‌ని అంటున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇవ‌న్నీ.. ఎప్పుడూ ఉన్న‌వే. కానీ.. ఇప్పుడే ఎందుకుప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి? అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఒక వ్యూహం ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాన్ని అంటే.. చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డం.. నంద‌మూరి కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకురావ‌డం.. వంటి అంశాల‌తో.. ఒక చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. అసెంబ్లీలో జ‌రిగిన విష‌యాన్ని జ‌రిగిన‌ట్టు తీసుకోవాలి. అక్క‌డే తేల్చుకోవాలి. కానీ.. చంద్ర‌బాబు దీనిని రోడ్డెక్కించారు. దీనికి తోడు.. నంద‌మూరి కుటుంబాన్ని సైతం దీనిలోకిలాగారు.

దీంతో ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల్లో.. టీడీపీ ప‌ని అయిపో యింది.. అందుకే.. లేనిపోని సాకులు వెతుక్కుని మ‌రీ.. ప్ర‌చారం కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగినా.. టీడీపీ బ‌లంగా ఉంద‌నుకునే వారు కూడా టీడీపీ బ‌ల‌హీనంగా ఉంద‌నే వాద‌న‌ను అంగీక‌రిం చాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ వాద‌న క్షేత్ర‌స్థాయిలో జోరుగా జ‌రుగుతోంది. ఈ విష‌యం.. ఇటీవ‌లమాజీ మంత్రులు.. వెళ్లిన‌ప్పుడు.. ప్ర‌త్య‌క్షంగా తెలిసింది. దీంతో ఇది.. చంద్ర‌బాబు వ‌ర‌కు చేరింది.

దీంతో ఆయ‌న అలెర్ట‌యి.. వెంట‌నే వ్యూహాత్మ‌కంగా.. పార్టీ భారీ ఎత్తున పుంజుకుంటోంద‌ని.. అసెంబ్లీ వివాదంతో సంబంధం లేకుండా.. యువ‌త పెద్ద ఎత్తున చేరువ అవుతున్నార‌ని.. ఇప్ప‌టికే భారీ ఎత్తున పార్టీ స‌భ్య‌త్వాలు కూడా న‌మోద‌వుతున్నాయ‌ని.. సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు.. టీడీపీ అనుకూల మీడియాలోనూ.. చంద్ర‌బాబు పుంజుకుంటున్నార‌నే వాద‌న‌ను తెర‌మీద‌కి తెస్తున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు ఏదో అనుకుంటే.. మ‌రేదో రిజ‌ల్ట్ వ‌చ్చింద‌నే వాద‌న మాత్రం ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపి్స్తుండ‌డం గ‌మ‌నార్హం.