Begin typing your search above and press return to search.
మోడి-షా ధ్వయానికి స్వామి హెచ్చరికలు
By: Tupaki Desk | 27 Jan 2021 8:00 PM ISTతమ కత్తికి ఎదురేలేదని అనుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా కు సొంతపార్టీ ఎంపి సుబ్రమణ్యంస్వామి తీవ్రంగా హెచ్చరికలు చేయటం సంచలనంగా మారింది. మోడి, షా ధ్వయాన్ని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా స్వామి హెచ్చరికలు చేశారు. ఢిల్లీలో రైతుల ర్యాలీ సందర్భంగా జరిగిన అల్లర్ల కారణంగా మోడి-షా పై ‘బలవంతులు’ అనే ముద్రకు తీరని నష్టం వాటిల్లినట్లు స్వామి ఆందోళన వ్యక్తంచేశారు.
ఇటువంటి గొడవలు జరిగే అవకాశం ఉందన్న కారణంతోనే, అనుమానంతోనే అసలు రిపబ్లిక్ డే వేడుకలే నిర్వహించవద్దని తాను ముందే చేసిన హెచ్చరికలను స్వామి గుర్తుచేశారు. రైతుల ఆందోళన కారణంగా రెండు రకాలుగా నష్టాలు జరిగినట్లు చెప్పారు. మొదటిదేమో పంజాబ్ కాంగ్రెస్, అకాలీదళ్ రాజకీయ నేతలు, వారి మధ్యవర్తలతో పాటు రెండోది మోడి-షా పై బలవంతులన్న ముద్రకు నష్టం జరిగిందని స్వామి వివరించారు.
రైతుల ఆందోళన కారణంగా లాభపడింది నక్సలైట్లు, డ్రగ్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్ధానీలే అని స్వామి ట్విట్టర్లో చెప్పటం కలకలం రేపుతోంది. కాబట్టి జరిగిన ఘటనల నుండి బీజేపీ ఇఫ్పటికైనా మేలుకోవాలని కూడా హెచ్చరించారు. భారత్ ను మరింతగా బలహీనం చేసేందుకు రాబోయే మార్చి-మే నెలల్లో ఛైనా భారీ దాడి చేసే అవకాశం ఉందని కూడా స్వామి హెచ్చరించారు. మొత్తానికి స్వామి చేసిన హెచ్చరికలు సంచలనంగా మారాయి.