Begin typing your search above and press return to search.

షాకింగ్ సీన్: ఏవీ సుబ్బారెడ్డి ముక్కులో రక్తం వచ్చేలా కొట్టిన అఖిలప్రియ వర్గం

By:  Tupaki Desk   |   17 May 2023 8:26 AM GMT
షాకింగ్ సీన్: ఏవీ సుబ్బారెడ్డి ముక్కులో రక్తం వచ్చేలా కొట్టిన అఖిలప్రియ వర్గం
X
లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నేతల మధ్య వర్గపోరు నడి బజార్లో కొట్లాటల వరకు వెళ్లింది. నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గానికి టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గానికి మధ్య జరిగిన కోట్లాటలో.. మాజీ మంత్రి భూమి అఖిలప్రియ వర్గం ఏవీ సుబ్బారెడ్డిని దారుణంగా కొట్టటంతో తీవ్రంగా గాయపడ్డారు. ముక్కులో నుంచి రక్తం కారేలా కొట్టటం ఒక ఎత్తు అయితే.. ఇదంతా జరిగినప్పుడు భూమా అఖిలప్రియ అక్కడే ఉండటం గమనార్హం.

షాకింగ్ నిజం ఏమంటే.. భూమా అఖిలప్రియ తండ్రి దివంగత భూమా నాగిరెడ్డికి ప్రాణ స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి. వారి మధ్య అనుబంధం.. స్నేహ బంధం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అయితే.. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు అధిపత్య పోరు మొదలైంది. నెమ్మదస్తుడైన పేరున్న ఏవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి కానీ ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అధినాయకత్వం కూడా సానుకూలంగా ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఇరువురు తమ బలాన్ని ప్రదర్శించుకోవటంకోసం ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకినారా లోకేశ్ అడుగు పెట్టే నేపథ్యంలోఆయనకు ఘన స్వాగతం పలకటానికి భూమా అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిలు తమ అనుచరులతో కొత్తపల్లికిచేరుకున్నారు. లోకేశ్ ముందు బలప్రదర్శనకు దిగారు. తమ బలాన్ని నిరూపించుకోవాలన్న ప్రయత్నం శ్రుతిమించి రాగాన పడింది.

తొలుత భూమా అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిల మధ్య మొదలైన మాటల యుద్ధం.. అంతకంతకూ ముదిరిపోయింది. నడి రోడ్డు మీదనే ఘాటు పదాలతో రెచ్చిపోయారు. పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలోభూమా వర్గీయులు తొడగొట్టి మరీ సవాలు విసిరారు. సీన్ అక్కడితో ఆగలేదు. ఉద్రిక్తతలు పెరిగిపోయిన వేళ.. భూమా అఖిలప్రియ వర్గం ఏవీ సుబ్బారెడ్డి మీద దాడికి దిగారు. ఆయన్నుచుట్టుముట్టి రక్తం వచ్చేలా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. రోడ్డు మీద పడేశారు.

ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డి మీద దాడి జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సుబ్బారెడ్డి.. దమ్ముంటే డైరెక్టుగా వచ్చి కక్ష తీర్చుకోవాలని సవాలు విసిరారు. మరోవైపు తీవ్ర గాయాలైన ఏవీ సుబ్బారెడ్డిని ఆయన అనుచరులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏవీ సుబ్బారెడ్డి మీద దాడి జరిగినప్పుడు అఖిలప్రియ అక్కడే ఉండటం గమనార్హం.

ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తర్వాతే ఎవరైనా అంటూ కేకలు వేస్తూ.. విరుచుకుపడిన అఖిల ప్రియ తీరు హాట్ టాపిక్ గా మారింది. ఘాటైన పదాలతో ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులపై ఆమె విరుచుకుపడిన తీరు ఇప్పుడుసంచలనంగా మారింది. ఏవీ సుబ్బారెడ్డి మీద దాడి తీవ్రత ఎక్కువైన వేళ.. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకొని లాఠీ ఛార్జ్ చేసి రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు తొలిగాయి. తన పాదయాత్ర వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలపై నారా లోకేశ్ ఎలా రియాక్టు అవుతారు? రెండు వర్గాల పంచాయితీని ఎలా తేలుస్తారు? పార్టీ ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.