Begin typing your search above and press return to search.

శ్రీ‌కాకుళం వార్త : చంద్ర‌న్న రోడ్ షో హిట్ .. కానీ !

By:  Tupaki Desk   |   5 May 2022 6:50 AM GMT
శ్రీ‌కాకుళం వార్త : చంద్ర‌న్న రోడ్ షో హిట్ .. కానీ !
X
నిన్న‌టి వేళ ఉత్త‌రాంధ్ర ఊరికి అంటే శ్రీకాకుళం జిల్లా ద‌ల్ల‌వ‌ల‌స‌కు వ‌చ్చారు అధినేత చంద్ర‌బాబు. టీడీపీ అధినేత అని రాయాలి.ఆ విధంగా ఆయ‌న శ్రేణుల‌ను ఉత్సాహ ప‌రిచి వెళ్లారు. ముఖ్యంగా ఎన్న‌డూ లేని విధంగా దిగువ శ్రేణి నాయ‌కుల‌ను అంతా క‌లిసి వెళ్లారు.

ఇదే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. వైసీపీ ఊహించ‌నంత‌గా జ‌నం రావ‌డంతో ధ‌ర్మాన వ‌ర్గీయుల‌కు క‌ల‌వ‌రం రేపింది.అస్స‌లు బాబు రోడ్ షో అంత పెద్ద హిట్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు కూడా !ఎందుకంటే ఆయ‌న ఇక్క‌డికి వ‌చ్చి మూడేళ్లు దాటిపోతోంది. అధికారం పోగొట్టుకున్నాక ఆయ‌న చాలా వ‌ర‌కూ అమ‌రావ‌తికి లేదంటే హైద్ రాబాద్ కు ప‌రిమితం అయి ఉన్నారు.

లోకేశ్ వ‌చ్చినా కూడా చంద్ర‌బాబుకు వ‌చ్చినంత జనం వ‌స్తారో రారో కానీ దారి పొడువునా, ఫ్లై ఓవ‌ర్ల పైనా ఆయ‌న‌కు మామూలుగా కాదు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న‌కు ఉత్త‌రాంధ్ర అంటే సెంటిమెంట్ . ఇంకా చెప్పాలంటే ఆయ‌న మామ ఎన్టీఆర్ కు కూడా ఉత్త‌రాంధ్ర అంటే సెంటిమెంట్. ఆయ‌న ప్ర‌భంజ‌నానికి ఎంత‌గానో స‌హ‌కరించిన ఊళ్లు ఉత్త‌రాంధ్ర‌వే కావ‌డం, ఇక్క‌డి వారికి ఎన్టీఆర్ అంటే అమిత‌మ‌యిన అభిమానం ఉండ‌డం విశేషం. అంతేకాదు ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి ఫ‌క్తు అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సినీ హీరోలు బాల‌య్య కు, తార‌క్ కు విప‌రీతం అయిన అభిమానులు ఉన్నారు.

పెద్దాయ‌న అంటే ఎంత గౌర‌వమో అంతే స్థాయిలో నంద‌మూరి వారింటి అల్లుడు అన్నా ఉత్త‌రాంధ్ర‌లో అంతే గౌర‌వం ఉంది. అందుకే ఆయ‌న వ‌చ్చారంటే జ‌నం బారులు తీరారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను టార్గెట్ చేసుకుని చాలా అంటే చాలా హుందాత‌నంతో కూడిన ప్ర‌సంగం చేసి వెళ్లారు. ఇది క‌దా కావాలి. ఆయ‌న బూతులు మాట్లాడ‌రు. ఎంత కోపం వ‌చ్చినా అణుచుకుంటారు.

అతి పొగ‌డ్త‌లు వ‌ద్దు అంటారు. దండ‌లు వ‌ద్దు అని చెబుతారు. స‌న్మానాలు వ‌ద్దు అని వారిస్తారు. అందుకే ఆయ‌నంటే చాలా మందికి ఉత్త‌రాంధ్ర‌లో అభిమానం కూడా ! ఇదే వైసీపీ కోపానికి కార‌ణం కావొచ్చు. అఫ్ కోర్స్ వైసీపీకి కూడా కార్య‌క‌ర్త‌ల శ్రేణి ఉండ‌వ‌చ్చు.

కానీ చంద్ర‌బాబు రాక నేప‌థ్యంలోనే కొన్ని విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. బాగుంది. రిమ్స్ ను బాగు చేయ‌డం అన్న‌ది వైసీపీ ప్ర‌థ‌మ ల‌క్ష్యంగా పెట్టుకుని ప‌నిచేసి ఉంటే మంచిదే అని ధ‌ర్మాన‌ను ఉద్దేశించి టీడీపీ అంటోంది. ప్ర‌జారోగ్యానికే ప్రాధాన్యం ఇస్తే ఆస్ప‌త్రుల ద‌గ్గ‌ర అంబులెన్స్ దందాల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేక‌పోతున్నార‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ నిన్న‌టి రోడ్ షో హిట్.