Begin typing your search above and press return to search.

ముస్లింల‌ను బ‌క‌రాలు చేసిన సోనియా

By:  Tupaki Desk   |   24 Jun 2016 4:46 AM GMT
ముస్లింల‌ను బ‌క‌రాలు చేసిన సోనియా
X
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయంపై ముస్లింలు మండిప‌డుతున్నారని అంటున్నారు. సాధార‌ణంగా రంజాన్ స‌మ‌యంలో ఆయా పార్టీలు ఇఫ్తార్ విందులు ఏర్పాటుచేసే సంగ‌తి తెలిసిందే. అయితే మార్చే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇఫ్తార్ విందును రద్దు చేసుకుంది. ఇఫ్తార్ పార్టీని సంప్రదాయపరమైన వేడుకలాగా కాకుండా రాజకీయ వేదికగా ఉప‌యోగించుకునే కాంగ్రెస్ ఇపుడు స‌మాచారం లేకుండానే ర‌ద్దు చేసుకోవటం ఈ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అంతేకాకుండా త‌మ విశ్వాసాల‌ను యువ‌రాజు రాహుల్ గాంధీ కోసం ప‌క్క‌న‌పెట్టేశార‌ని ఆ వ‌ర్గానికి చెందిన వారు ఫైర‌వుతున్న‌ట్లు స‌మాచారం.

సాధారణంగా ప్రతి సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలోని అశోకా హోటల్‌ లో ఇఫ్తార్ విందు ఇవ్వటం సోనియాగాంధీ సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చే ఇఫ్తార్ విందుతో పాటు అశోకా హోటల్‌ లో కాంగ్రెస్ ఇచ్చే విందు ఢిల్లీలో అతి పెద్ద ఇఫ్తార్ పార్టీలుగా చెప్పుకుంటారు. అలాంటిది ఈ సంవత్సరం ఇఫ్తార్ విందును ఇవ్వరాదని సోనియా నిర్ణ‌యించారు. అనూహ్యంగా ఇఫ్తార్‌ ను రద్దు చేసుకోవటం పార్టీ వర్గాల్లోనే ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.

పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన లేకుండా ఇఫ్తార్ విందు ఇవ్వటం సరికాదన్న ఆలోచనతో రద్దు చేసుకున్నట్లు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. వస్తు సేవల పన్ను(జీఎస్‌ టీ) విషయంలో కాంగ్రెస్ పూర్తిగా ఒంటరి అవుతోంది. నిరుడు కాంగ్రెస్‌ తో సానుకూలంగా ఇఫ్తార్‌ లో ఒకే టేబుల్ పంచుకున్న టీయంసీ - జెడియులు ఈసారి మెజార్టీ పార్టీలతో కలిసి జీఎస్‌ టీకి ఓకే అన్నాయి. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడింది. అయితే హైకమాండ్ అక‌స్మిన నిర్ణ‌యంతో కాంగ్రెస్ నాయ‌కులు గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. మైనార్టీ ముస్లింల‌కు తామే అండ‌గా ఉంటామ‌ని ప‌దే ప‌దే చెప్పుకొంటూ అదే స‌మ‌యంలో వారి మ‌త విశ్వాసాల‌ను కూడా గౌర‌వించ‌కపోవ‌డం, అది కూడా సొంత కార‌ణాల‌తో కావ‌డం ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామమ‌ని పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.