Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు చేత‌కాని మ‌నిషి: సోము వీర్రాజు

By:  Tupaki Desk   |   26 Dec 2018 12:13 PM GMT
చంద్ర‌బాబు చేత‌కాని మ‌నిషి: సోము వీర్రాజు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి - టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆయ‌న్ను చేత‌గాని వ్య‌క్తిగా అభివ‌ర్ణించారు. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ధ‌మ్మున్న నేత‌గా పేర్కొన్నారు. చంద్ర‌బాబు ర‌క్తంలోనే అవినీతి ఉంద‌ని విమ‌ర్శించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు త‌న ఘ‌న‌తే అని చెప్పుకునేందుకు బాబు ప‌డుతున్న తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న‌గా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిస్తుండ‌టం పై సోము వీర్రాజు బుధ‌వారం ఫైర్ అయ్యారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు అని తెలిపారు. దానితో చంద్ర‌బాబుకు ఏమాత్రం సంబంధం లేద‌న్నారు. పీపీఏ క‌నుస‌న్న‌ల్లో జ‌ర‌గాల్సిన నిర్మాణ ప‌నుల‌ను చంద్ర‌బాబు అన్యాయంగా ఓన్ చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబును ఎంగిలి కాఫీ తాగే ర‌కంగా పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని వీర్రాజు చెప్పారు. ధ‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాలంటూ చంద్ర‌బాబుకు స‌వాలు విసిరారు. చంద్ర‌బాబు ర‌క్తంలో అవినీతి ఉంద‌ని వీర్రాజు విమ‌ర్శించారు. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ చివరకు టాయిలెట్లు, బాత్‌ రూమ్‌ లను కూడా నాకేస్తున్నారంటూ తీవ్ర‌స్థాయి వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం పై అబ‌ద్ధ‌పు ప్ర‌చారానికి చంద్ర‌బాబు ఇక‌నైనా తెర‌దించాల‌ని హిత‌వు ప‌లికారు. పోల‌వ‌రం పై త‌న ప‌చ్చ మీడియ‌లో చంద్ర‌బాబు దుష్ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ నేతలు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావుల పై కూడా వీర్రాజు ధ్వ‌జ‌మెత్తారు. మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేద‌న్నారు.