Begin typing your search above and press return to search.

రాహుల్ స‌న్నిహితుడితో సీక్రెట్ మీటింగ్‌?

By:  Tupaki Desk   |   27 Jun 2018 4:22 AM GMT
రాహుల్ స‌న్నిహితుడితో సీక్రెట్ మీటింగ్‌?
X
ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌డిచిన నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంలో త‌మ‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల గురించి కొంద‌రు ఐఏఎస్ అధికారులు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి స‌న్నిహితుడైన నేత‌తో సీక్రెట్ మీటింగ్ జ‌రిపిన వైనం బ‌య‌ట‌కు పొక్కింది. అధికార‌.. విప‌క్షాల‌తో పాటు.. ఢిల్లీ స్థాయిలోనూ ఈ మీటింగ్ హాట్ టాపిక్ గా మారిన‌ట్లు తెలుస్తోంది.

కేసీఆర్ స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానాల‌పై వారీ సంద‌ర్భంగా ఫిర్యాదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మ వ‌ర్గానికి చెందిన ఐఏఎస్ ల‌ను దూరం పెట్టార‌ని.. అప్రాధాన్య‌త పోస్టులు ఇస్తున్న‌ట్లుగా కంప్లైంట్స్ చేయ‌టంతో పాటు.. త‌మ‌కు స‌రైన పోస్టులు ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఒక‌రు అడ్డు ప‌డుతున్నార‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. ముఖ్య‌మంత్రితో తాము భేటీ అవ్వాల‌నుకున్నట్లు చెప్ప‌గా.. అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటిదేమీ చేయ‌లేద‌న్న ఫిర్యాదు కూడా చేసిన‌ట్లుగా స‌మాచారం.

త‌మ వ‌ర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులకు అప్రాధాన్య‌త పోస్టుల్లో ఉంచ‌టంపై వారు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలిసింది. ఈ ర‌హ‌స్య స‌మావేశానికి హాజ‌రైన ఒక ఐఏఎస్ అధికారి మ‌రో అధికారితో మీటింగ్ స‌మాచారం వెల్ల‌డించ‌టంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ భేటీ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన ప‌త్రాల్ని రాహుల్ స‌న్నిహితుడికి అప్ప‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ త‌ర‌హా అనుమానంతోనే స‌ద‌రు ఐఏఎస్ అధికారుల్ని ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా తెలంగాణ ప్ర‌భుత్వ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రాహుల్ కు స‌న్నిహితంగా ఉండే నేత‌కు.. తెలంగాణ ఐఏఎస్ లు కొంద‌రు ర‌హ‌స్యంగా భేటీ కావ‌టం.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేసిన మియాపూర్ భూముల ఇష్యూతో పాటు.. మ‌రిన్ని అంశాల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని అందించిన వైనాన్ని తెలుసుకున్న కేంద్రం అలెర్ట్ అయ్యింది. నిఘా వ‌ర్గాల్ని రంగంలోకి దించి.. ఈ ర‌హ‌స్య భేటీపై నివేదిక అందించాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు. అధికార‌ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలా కొంద‌రు ఐఏఎస్ అధికారులు జ‌ట్టుగా మారి .. విప‌క్ష నేత‌కు స‌మాచారాన్ని అందేలా ప్ర‌య‌త్నించ‌టంపై గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.









.