Begin typing your search above and press return to search.
ఈ ఫొటో చూశారా? ఒక చేతిలో సుత్తి, రెండో చేతిలో కర్ర దీని అర్థమేంది?
By: Tupaki Desk | 20 Oct 2021 8:30 AMఈ ఫొటో చూశారా? టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల్లో ఒక చేతిలో సుత్తి, రెండో చేతిలో కర్ర. దీని అర్థమేం ది? దీనిని మీడియాకు చూపించడంలో .. చంద్రబాబు ఉద్దేశం ఏంటి? ఆయన ఏమనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. విషయంలోకి వెళ్తే.. మంగళ వారం రాత్రి సమయంలో మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీకి చెందిన కార్యకర్తలు.. దాడులు చేశారు. దీనికి పూర్వాపరాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ క్రమంలో రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి పెద్ద పెద్ద కర్రలు, సుత్తులు.. రాళ్లు వినియోగించారనేది టీడీపీ ఆరోపణ.
దీనికి ఆధారంగానే.. వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్‌లో వదిలి వెళ్లారో.. లేక వైసీపీ నేతల నుంచి టీడీపీ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారో.. ఏదేమైనా.. కొన్ని కర్రలు, సుత్తులు.. టీడీపీ నేతలకు లభించాయి. వీటినే చంద్రబాబు మీడియా కు చూపించారు. ఘటన అనంతరం.. టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని పరిశీలించిన చంద్రబాబు.. ఆయా వస్తువులను స్వాధీనం చేసుకుని.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాటిని ఆయన మీడియాకు చూపించారు. ఇలాంటి ఆయుధాలను వినియోగించారంటూ.. మీడియాకు చెప్పారు. కర్రలతో తమ కార్యకర్తలను కుళ్లబొడిచారని.. సుత్తులతో అద్దాలు పగులగొట్టారని వివరించారు.
ఈ క్రమంలోనే ఒక చేత్తో సుత్తి, మరో చేత్తో కర్ర పట్టుకున్నారు. వీటితోనే తమ కార్యాలయంపైనా.. తమ నేతలపైనా..వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారంటూ.. చెప్పారు. అయితే.. ఈ ప ట్టుకున్న విధానం చూస్తే.. మరో రూపంలో చంద్రబాబు సందేశం ఇస్తున్నట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక నుంచి మేం కూడా వీటితోనే సమాధానం చెబుతాం..! అన్నట్టుగా ఉందని చంద్రబాబు స్పష్టం చేస్తున్నట్టుగా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని.. ఇక నుంచి తాము కూడా ఇలానే కసి తీర్చుకుంటామనే రీతిలో ఆయన వాటిని మీడియాకు చూపించి ఉంటారని.. పైకి చెప్పకపోయినా.. మనసులో మాత్రం అదే ఉండి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చూడడం.. బాధపడడం ఇదే తొలిసారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.