Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాక్: సుప్రీంకోర్టుకు సీఐడీ

By:  Tupaki Desk   |   20 March 2021 3:03 PM IST
చంద్రబాబుకు షాక్: సుప్రీంకోర్టుకు సీఐడీ
X
అమరావతి అసైన్డ్ భూముల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేయడం తెలిసిందే. అమరావతి పరిధిలో అక్రమంగా వారు దళితుల భూములను లాక్కున్నారని విచారణ జరిపి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అనంతరం విచారణ జరిపి చంద్రబాబు, నారాయణకు నోటీసులు అందజేశారు.

అయితే చంద్రబాబు, నారాయణలు ఈ కేసులోపై ఏపీ హైకోర్టుకు ఎక్కారు. తాజాగా విచారణపై స్టే తీసుకొచ్చారు. దీంతో కేసు ముందుకు సాగకుండా అయ్యింది.ఈ కేసులో తాజాగా ఏపీ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంకు వెళ్లనుంది. హైకోర్టు స్టే ఆర్డర్ ను సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది.కాగా ఈ కేసులో చంద్రబాబు, నారాయణలపై 4 వారాలపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.