Begin typing your search above and press return to search.
సర్కారు స్పందిచలేదు షబ్బీర్ రియాక్ట్ అయ్యారు
By: Tupaki Desk | 10 Sept 2015 10:53 AM ISTహైదరాబాద్ నడిబొడ్డున లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న కరెంటు స్తంభానికి ఊరేసుకున్న రైతు లింబయ్య కష్టాలపై కాంగ్రెస్ స్పందించింది. నాలుగేళ్లుగా చేస్తున్న వ్యవసాయం నష్టాలపాలు కావటం.. పెద్దకొడుకు అనారోగ్యం పాలు కావటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో.. అప్పుల ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే.
లింబయ్య చావు పై స్పందించాల్సిన తెలంగాణ సర్కారు రియాక్ట్ కాకున్నా.. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం రియాక్ట్ అయ్యింది. ఆత్మహత్య చేసుకున్న లింబయ్య కుమారుడు అనారోగ్యానికి తాము చికిత్స చేయిస్తామని.. అందుకు అవసరమైన మొత్తాన్ని తాము అందిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రకటించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు స్పందించి.. సాయం సంబంధించిన ప్రకటన చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.